టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు ఈవెంట్లలో.. ఇంటర్వ్యూలలో వీళ్ళు ఇద్దరికీ ఎలాంటి బాండింగ్ ఉందో క్లియర్ గా ఒకరి గురించి ఒకరు వివరిస్తూ వచ్చారు. వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు.. తారక్ ఫస్ట్ మూవీ స్టూడెంట్ నెంబర్ 1 నుంచే.. వీళ్ళిద్దరి జర్నీ మొదలైంది. దాదాపు పాతికేళ్ల నుంచి వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే.. తారక్ గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. స్టూడెంట్ నెంబర్ 1 సినిమా.. కంప్లీట్ అయిన తర్వాత రాజీవ్.. తారకను ఉద్దేశించి ఓ మాట అన్నాడట. నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోను.. నన్ను కూడా మర్చిపోవు కదా అని. దానికి.. తారక్ రియాక్ట్ అవుతూ నిన్ను మర్చిపోను.. మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ గానే ఉంటామంటూ మాటిచ్చాడట.

ఆ మాటకు కట్టుబడి ఇప్పటికి వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్‌గానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే.. తారక్ నటించిన చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల కీలక పాత్రలో మెరిసాడు. ఇద్దరు కలిసి టూర్లకు వెళ్లడం, పలు ఈవెంట్లలో కలిసి సందడి చేయడం.. వీళ్ళిద్దరూ బాండింగ్ కు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఇద్దరి మధ్యనే కాదు.. వీళ్ళ కుటుంబాల మధ్యన కూడా మంచి ఫ్రెండ్లీ బాండ్ నెలకొంది. అయితే.. ఇలాంటి స్ట్రాంగ్ బాండింగ్ పై కొద్దిరోజులుగా విభేదాలు వచ్చాయంటూ వార్తలు చెలరేగాయి. ముఖ్యంగా.. అశోక్ మూవీ టైం లో వీళ్ళిద్దరి మధ్య మాటా.. మాటా.. పెరగడంతో ఇద్దరు దూరమైపోయారని.. వీళ్ళ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయింది అంటూ గుసగుసలు వినిపించాయి.
అయితే.. ఇప్పటికీ ఆ రూమర్ కొనసాగుతూనే ఉంది. ఇక.. రాజీవ్ కనకాల ఈ విభేదాల వార్తలపై చాలా ఇంటర్వ్యూల్లో క్లారిటీ ఇచ్చినా.. ఈ వార్తలకు మాత్రం చెక్ పడలేదు. ఆయనను వదలకుండా.. ఎక్కడికి వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతూనే ఉన్నారు. ఇందులో భాగంగానే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మరోసారి రాజీవ్ రియాక్ట్ అయ్యాడు. ఎన్టీఆర్‌తో గొడవలు వార్తలు పై ఆయన మాట్లాడుతూ షాకింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. మా మధ్య అసలు ఎప్పుడు గొడవలు జరిగాయో మాకే తెలియట్లేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసాడు. ఈ వార్త ఎప్పుడో 8 ఏళ్ల క్రితమే మొదలైంది. నేను వెంటనే ఎన్టీఆర్ కు ఫోన్ చేసి.. ఇలాంటి వార్త ఒకటి వస్తుంది ఏం చేయాలని అడిగా. అప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం ఇదే అంటూ రాజీవ్ చెప్పుకొచ్చాడు.
నువ్వు కంగారు పడకు.. ఇలాంటివి కామనే. ముందు ముందు ఇంకా ఎక్కువ వస్తాయి. నీ దగ్గర కూడా వచ్చి అడుగుతారు. అసలు వాటన్నింటినీ పట్టించుకోకు. లెక్క చేస్తే ఇంకా ఎక్కువ చేస్తారు. లేనిది ఉన్నట్లు క్రియేట్ చేస్తారు. నువ్వు లైట్ తీసుకో అని తారక్ అన్నాడంటూ రాజీవ్ కనకాల వివరించాడు. గతంలో కూడా రాజీవ్ విషయంపై రియాక్ట్ అయ్యాడు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించా.. ఇంకా మా మధ్య గొడవలు ఉన్నాయంటే ఆ సినిమాల్లో అసలు నేనెందుకు నటిస్తా అంటూ ప్రశ్నించాడు. అలాగని.. తారక్ ప్రతి సినిమాలను నేను నటించడం కుదరదు కదా. అది పూర్తిగా డైరెక్టర్ ఛాయిస్ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక.. తారక్ నాకంటే చిన్నవాడు. మా స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అంటూ వాళ్ళ ఫ్రెండ్షిప్ పై ఫుల్ ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం రాజీవ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.


