డ్రగ్స్ ఇష్యూలో మరో సెన్సేషన్ టాలీవుడ్ హీరో పై ఈడీ విచారణ..!

గత కొద్దిరోజుల క్రితం టాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం కుదిపేసిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో.. డ్రగ్స్ కొనుగోలు, సప్లై వ్యవహారంలో ప్రముఖ సినీ నటుడు.. హీరో శ్రీరామ్ (శ్రీకాంత్), కృష్ణ పేర్లు బయటకు రావడంతో నెటింట పెద్ద దుమారమే రేగింది. ఈ వ్యవహారంపై.. దర్యాప్తును కొనసాగిస్తున్న ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ట్‌) తాజాగా వీళ్ళిద్దరికీ సమన్లు జారీ చేసింది. అసలు మ్యాట‌ర్ ఏంటంటే.. గత జూన్‌లో ప్రదీప్ కుమార్ అనే వ్యక్తికి డ్రగ్స్ ను సప్లై చేస్తున్న నేపథ్యంలో.. జాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతనిని విచారించిన పోలీసులకు.. చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ లభించిందట‌.

ED gets issued its first 'Purple Notice' from Interpol - The Economic Times

ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా.. డ్రగ్స్ రాకపోకలతో కొంతమంది సినీ ప్రముఖుల హస్తం కూడా ఉందంటూ పేర్లు బయటకు వచ్చాయి. ఆ జాబితాలో.. హీరో శ్రీకాంత్ తో పాటు కృష్ణ పేరు కూడా ఉండడంతో.. ఈడీ వీళ్లిద్దరికి సామాన్లు జారీ చేసి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లను కూడా పరిశీలించడం మొదలుపెట్టింది. ఈ కేస్ ఇటీవల ఈడీ పరిధిలోకి చేరడంతో.. శ్రీకాంత్ ఈనెల 28న కృష్ణను, ఈ నెల 29న శ్రీ‌రామ్‌ను విచారణకు హాజరు కావాల్సిందిగా అఫీషియల్ నోటీసులను జారీ చేశారు.

போதைப்பொருள் வழக்கு : ஸ்ரீகாந்தை அடுத்து பிரபல நடிகர் கைதாகிறாரா? is  krishna get arrested after srikanth in drug case?

వీరి.. సమాధానాలు ఆధారంగా ఇంకొంతమందిపై విచారణ జరగనుందట. టాలీవుడ్ లో ఇంకా కొంతమందికి ఈ డ్ర‌గ్స్‌ వివాదంలో హస్తం ఉందంటూ టాక్‌ నడుస్తుంది. ఈ క్రమంలోనే మరోసారి డ్ర‌గ్స్‌ ఇష్యూ ఇండస్ట్రీలో బహిర్గతం కావడంతో.. సినీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఎంతో మంది హీరోలు, టెక్నీషియన్లు, మేనేజర్లు ఈ కేసులో ఇరుక్కుని విచారణలకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ఇద్దరిని నటులపై ఈడీ దృష్టి సారించడంతో.. ముందు ముందు ఏం జరుగుతుందో.. ఇంకెన్ని పేర్లు బయటకు వస్తాయో అని సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి.