నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో 2021లో రిలీజ్ రిలీజ్ అయిన అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో.. ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ సినిమా బాలయ్య కెరీర్‌లో నివర్ బిఫోర్ బ్లాక్ బస్టర్‌గా నిలవడమే కాదు.. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇక.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 తాండవంలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆడియన్స్ లో భారీ హైప్ నెలకొంది.
ఇక.. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం ఆడియన్స్ ఆశక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. దీపావళి సెలబ్రేషన్స్ లో భాగంగా అఖండ బ్లాస్టింగ్ రోర్ పేరుతో వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో.. ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్ అంటేనే ఫ్యాన్స్ పక్క బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయిపోతారు. దానికి తగ్గట్టు.. బోయపాటి శ్రీను, బాలయ్యను డ్యూయల్ రోల్లో చూపిస్తూ ఫ్యాన్స్‌కు డబల్ ట్రీట్ ఇస్తూ వస్తున్నాడు. తను తెరకెక్కించిన ప్రతి సినిమా విషయంలో ఇది కామన్‌గా జరుగుతుంది. అయితే.. త్వరలోనే ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్న అఖండ 2 విషయంలోను మళ్ళీ ఇదే ఫార్ములాను బోయపాటి రిపీట్ చేశాడా అనే ప్రశ్నకు ఎస్ అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.
![]()
ఇక బాలయ్య ఎలివేషన్ వీడియోలో చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆడియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో మెప్పించింది. సౌండ్ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కి నవ్వుతానో.. ఏ సౌండ్ కి నరుకుతాను నాకే తెలియదు.. నా కొడకా ఊహకి కూడా అందదు అంటూ చెప్పినా డైలాగ్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే.. ఈసారి బొమ్మ మరింత వైల్డ్ గా ఉండబోతుందంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. సినిమా రిలీజ్ అయిన తర్వాత కచ్చితంగా బాక్స్ ఆఫీస్ రికార్డులు బ్లాస్ట్ చేయడం ఖాయమంటూ సినీవర్గాల నుంచి సైతం టాక్ వినిపిస్తుంది. అయితే.. బోయపాటికి కూడా ఈ సినిమాతో హిట్ కొట్టడం కచ్చితంగా అవసరం. ఈ క్రమంలోనే బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న అఖండ 2 ఆయన కెరీర్‌లో బైల్డ్ స్టోన్‌గా మారుతుందా.. లేదా.. వేచి చూడాలి. ఇక.. ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్‌ను పలకరించనుంది.

