టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్ అక్టోబర్ 23న అంటే నిన్న.. గ్రాండ్ లెవెల్‌లో జరిగిన సంఘటన తెలిసిందే. ఫ్యాన్స్‌తో పాటు.. సినీ సెలెబ్రెటీస్ సైతం.. డార్లింగ్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. అంతేకాదు.. తతన సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్డేట్స్ కూడా రివీల్ చేశారు మేకర్స్. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్ పేరు ప్రజెంట్ ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది. అయితే.. ఈ రేంజ్‌లో ప్రభాస్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కడానికి ఆయన సినిమాల సక్సెస్ తో పాటు.. వ్యక్తిత్వం కూడా ఓ ప్రధాన కారణం. ఇప్పటికే ప్రభాస్ గురించి ఆయనతో నటించిన ఎంతోమంది నటీనటులు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.

సాధారణంగా స్టార్ హీరోలు ఒక్క సినిమా కోసం కోట్ల రూపాయలను ఛార్జ్ చేస్తారు. కానీ.. ప్రభాస్ మాత్రం డబ్బు కంటే రిలేషన్స్, ఫ్రెండ్షిప్, లాయలటిని గౌరవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే.. తన అనుకున్న వాళ్ళ కోసం కథ నచ్చి.. ఒక్క రూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోకుండా నటించిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ప్రెజంట్ అయితే.. రూ.100 నుంచి రూ.150 కోట్ల రమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్న ప్రభాస్.. ఇప్పటికి తనకు కథ నచ్చి.. బడ్జెట్ కోపరేట్ చేయకపోతే.. తను రెమ్యూనరేషన్ కూడా మానుకోణఙ మఱృ సినిమాల్లో నటిస్తూ ఉంటాడు. అలా.. తన సినీ కెరియర్ లో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ప్రభాస్ నటించిన సినిమాల లిస్ట్ చాలాఈనే ఉంది. వాటిలో మొదటిది కన్నప్ప. మంచు విష్ణు హీరోగా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఓ కామియో రోల్ లో మెరిసిన సంగతి తెలిసిందే.
![]()
ఈ రోల్ కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని.. ఫ్రెండ్షిప్ కోసం సినిమా చేస్తా.. మనసు నుంచి చేస్తున్నా.. డబ్బులు వద్దు అని చెప్పేసాడని మంచు విష్ణు స్వయంగా ప్రకటించాడు. ఇక తాజాగా.. రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న మిరాయ్ సినిమాలో సైతం ప్రభాస్ వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ఇలాంటి సినిమాల కోసం రూ.50 కోట్ల వరకు ఛార్జ్ చేసినా.. అతి శయోక్తి లేదు. కానీ.. ప్రభాస్ మాత్రం అలాంటివి పట్టించుకోలేదు. డబ్బు కన్నా రిలేషన్స్, ప్రేమ, ఫ్రెండ్షిప్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చే ప్రభాస్.. ఈ మూవీకి ఒక్క రూపాయి కూడా తాసుకోలేదట. అంతేకాదు.. గతంలోను ప్రభాస్ చాలా సినిమాల్లోకి కామియో పాత్రల్లో రెమ్యూనరేషన్ లేకుండా నటించాడట. ఈ క్రమంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఆయనపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. గోల్డెన్ హార్ట్ పర్సన్, హ్యుమానిటీకి సింబల్ అంటూ.. ఎవరికూనా హెల్ప్ అవసరమైతే ప్రభాస్ ముందుంటాడంటూ.. కేవలం ప్రభాస్ ఓ స్టార్ హీరో కాదంటూ రకరకాలుగా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

