టాలీవుడ్ నటుడు ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే,, తాజాగా ఆయన దీపావళి సెలబ్రేషన్స్ గ్రాండ్ లెవెల్లో సెలబ్రేట్ చేశాడు. టాలీవుడ్‌కు చెందిన ఎంతో మంది స్టార్ సెలబ్రెటీస్‌ను ఆహ్వానించిన బండ్లా.. మెగాస్టార్ చిరంజీవిని చీఫ్ గెస్ట్‌గా పిలుచుకున్నాడు. అంతేకాదు.. చిరంజీవి కార్ నుంచి దిగింది మొదలు ఇంట్లోకి వెళ్లి సెలబ్రేషన్స్ పూర్తయ్యే వరకు కూడా ఆయనను ఎంతలా రాజ మర్యాదలతో బండ్ల గణేష్ గౌరవించాడు. ప్రతి ఒక్క మూమెంట్ సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతూనే ఉంది. చిరు కార్ దిగిన వెంటనే కాళ్ళు మొక్కి మరీ లోపలికి తీసుకువెళ్లిన బండ్ల.. కేవలం చిరు కోసమే స్పెషల్గా చేయించిన చైర్ లో కూర్చోబెట్టి ఆయనను గౌరవించాడు.
అంతేకాదు.. ఆ చైర్.. చిరంజీవి గారి కోసం స్పెషల్గా చేయించాలని.. అందులో ఆయన కూర్చున్నప్పుడు నేను ఆనంద పర్వశంలో తేలిపోయా అంటూ వివరించాడు. అయితే.. మెగాస్టార్‌కు మాత్రమే ఈ రేంజ్‌లో బండ్ల గణేష్ రాజ మర్యాదలు చేయడం వెనుక ఓ బలమైన కారణమే ఉందట. మెగాస్టార్ లో ఉన్న గుడ్ క్వాలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి నలుగురికి సహాయం చేయడంలో ముందు వరుసలో ఉంటాడు. ఈ క్రమంలోనే.. అభిమానులకు ఎంతోమందికి తన చేయూతనివ్వడమే కాదు.. బ్లడ్ బ్యాంకుల ద్వారా సరైన సమయానికి ఆపదలో ఉన్న వారికి బ్లడ్ అందేలా చేశాడు.
ఇండస్ట్రీలోనూ ఇప్పటికీ ఏదైనా సమస్య వచ్చిందంటే ముందు చిరునే గుర్తుకు వస్తారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ చిరంజీవిని పిలిచి మరి అంతలా ప్రత్యేకంగా గౌరవించారట. అంతేకాకుండా.. మరో బలమైన కారణం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే బండ్ల గణేష్ ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో వెల్లడించాడు. తనకు రెండుసార్లు కరోనా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. మొదటిసారి కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత మరోసారి ఎటాక్ అవ్వదని నమ్మకంతో లైట్ తీసుకున్నాడట బండ్ల. దీంతో.. 80 శాతం లంగ్స్ ఫెయిల్ అయిపోయాయి. హాస్పిటల్‌లో సరైన ట్రీట్మెంట్ అందకపోతే.. తర్వాత రోజు చనిపోయే స్టేజ్ కి వెళ్ళిపోయా. అలాంటి టైంలో చిరంజీవి గారు విషయం తెలుసుకొని వెంటనే అపోలోకు పంపించారు.
అక్కడ డాక్టర్ తో మాట్లాడారు. ఏకంగా పదిమంది నాకు ట్రీట్మెంట్ చేశారు. ఒకటికి వందసార్లు కాల్ చేసి మరి నా పరిస్థితి ఎలా ఉందో కనుక్కున్నారు. నేను సెట్ అయిన తర్వాత ఎందుకు నెగ్లెట్ చేశావు అంటూ మందలించారు.. ఇప్పటికి ఆయన చేసిన హెల్ప్ నేను మర్చిపోలేను. ఒకవేళ ఆరోజు ఆయన నాకు సహాయం చేసి ఉండకపోతే నేను ప్రాణాలతోనే ఉండే వాడిని కాదు.. దానికి నేను ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటా అంటూ చెప్పుకొచ్చాడు. ఆ త్రో బ్యాక్ వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా మెగాస్టార్‌కు బండ్ల గణేష్ రాజ మర్యాదలు చేయడం వెనుక బలమైన కారణం అదేనంటూ టాక్ వినిపిస్తుంది. ఇక బండ్ల మొదటి నుంచి మెగా ఫ్యామిలీకి మంచి అభిమాని కావడంతో.. ఆయనను పిలిచి ఇంతలా గౌరవించడట.