టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియాను షేక్ చేసిన జక్కన్న.. త్రిబుల్ ఆర్ లోని నాటు నాటు సాంగ్ తో ప్రపంచం మొత్తం షేక్ అయ్యేలా చేశాడు. అయితే.. ఇప్పుడు చేస్తున్న మహేష్ సినిమాతో ఫస్ట్ టీజర్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ లో రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. ఇక మహేష్తో రాజమౌళి సినిమా సైలెంట్ షూట్‌ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి మేకర్స్ ద్వారా.. ఎలాంటి అప్డేట్ కూడా బయటకు రాలేదు. హైదరాబాద్ వేదికగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ సమక్షంలో నవంబర్‌లో ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే గ్లింప్స్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది.
నవంబర్ 11 లేదా 15 తేదీల్లో ఈ సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్ కూడా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేసేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. అయితే.. ఇది ఒక బిగ్గెస్ట్ వేడుకగా సెలబ్రేట్ చేయనున్నాడని టాక్ నడుస్తుంది. ఇక.. జక్కన్న తను తీసే సినిమా విషయంలోనే కాదు.. ప్రమోషన్‌ల విషయంలోను ఎప్పుడు.. ఏది రివీల్ చేయాలో ఓ పర్ఫెక్షన్‌తో ఉంటాడు. ఈ క్రమంలోనే.. తాను తెరకెక్కించిన 29 సినిమాల విషయంలోనూ ఇదే ప్లానింగ్ తో అదిరిపోయే సక్సెస్ ను అందుకున్నాడు. కేవలం తెలుగు కథలతోనే పాన్ ఇండియా క్రేజ్‌ను దక్కించుకున్నాడు. ఇప్పుడు.. రాజమౌళి డైరెక్షన్‌లో తాను చేస్తున్న సినిమాతో హాలీవుడ్‌ని టార్గెట్ చేశాడు మహేష్.
సాధారణంగా రాజమౌళి సినిమా అంటేనే పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్‌లో బజ్ మొదలైపోతుంది. అలాంటిది.. సూపర్ స్టార్ మహేష్ బాబు లీడ్ రోల్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ లో ఏ రేంజ్ హైప్ క్రియేట్ అవుతుందో చెప్పనవసరం లేదు. ఈ సినిమాతో.. వీళ్ళిద్దరూ తెలుగు సినిమా ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్ లో నిలబెడతారని ధీమా ఫాన్స్ లో వ్యక్తమౌతుంది. ప్రియాంక చోప్రా హీరోయిన్గా మెరుస్తుండగా.. పృధ్విరాజ్ సుకుమారన్ లీడ్ రోల్‌లో మెరవనున్నాడు. నవంబర్ నుంచి.. ఈ మూవీ సంబరాలు ప్రారంభమవుతాయి. హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్న మేకర్స్. వెన్యూ ఇంకా ఫిక్స్ కాలేదట. ప్రస్తుతం ఇది డిస్కషన్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ఈవెంట్‌లో మూవీ గ్లింప్స్, టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారేమో వేచి చూడాలి.