ఇండస్ట్రీలో నటినట్లుగా ఎంట్రీ ఇచ్చి ఒకసారి స్టార్ సెలబ్రెటీల్ గా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారంటే చాలు వాళ్ళకు సంబంధించిన ఏ చిన్న విషయాలైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హీరో, హీరోయిన్లకు సంబంధించిన సినిమాలతో పాటు.. పర్సనల్ విషయాలు సైతం ఎప్పటికప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా.. ఓ హీరోయిన్ ఇతర హీరోలతో కానీ, దర్శకులతో కానీ కలిసి ఒకే చోట కనిపిస్తే చాలు.. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ షిప్ ఉందంటూ వార్తలు వైరల్ అయిపోతాయి. అలా.. ఇప్పుడు తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌తో ఎన్టీఆర్ హీరోయిన్ రిలేషన్షిప్లో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక వాళ్ళిద్దరూ కలిసి తిరుమలకు వెళ్లిన ఫొటోస్ కూడా రివిల్ కావడంతో ఈ వార్తలు మరింత హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు ఈషా రెబ్బ. ఈ అమ్మడు తరుణ్ భాస్కర్ తో ప్రేమలో ఉందంటూ టాక్ నడుస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి గతంలో తిరుపతికి వెళ్లిన ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే అప్పుడు ఆడియన్స్ అంతా లైట్ తీసుకున్నా.. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరూ దీపావళి సెలబ్రేషన్స్ లో కలిసి సందడి చేశారు. ఎన్నో రకాల ఫొటోస్ కు స్టిల్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి.
ఈ క్రమంలోనే ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్లు తెగ ట్రెండ్ అవుతున్నాయి. హీరో విశ్వక్సేన ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ లో.. వీళ్ళిద్దరూ కలిసి సందడి చేస్తారు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి ప్రేమలో ఉన్నారనే సందేహాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో హీరోయిన్గా మెరిసిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సినిమాలో సెకండ్ హీరోయిన్ గాను నటించి మెప్పించింది. వాస్తవంగా తెలుగు అమ్మాయి అయినా ఇషా అందం, అభినయంతో మంచి కంటెంట్ ఎంచుకుంటూ సినిమాలో నటించినా.. ఊహించిన రేంజ్లో అవకాశాలు మాత్రం దక్కడం లేదు. ఇక.. ఈమె గతంలో ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ సినిమాలోను హీరోయిన్ చెల్లెలి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఇషా తర్వాత పలు సినిమాల్లో వరసగా నటించిన సరైన సక్సెస్ అందుకోలేకపోయింది. ఇలాంటి క్రమంలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో అమ్మడి ప్రేమాయణం వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక దీనిపై వీళ్ళిద్దరిలో ఎవరైనా క్లారిటీ ఇస్తారా.. లేదా.. ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.