టాలీవుడ్ మెగాస్టార్గా చిరంజీవి దాదాపు ఐదున్నర దశాబ్దాలు కాలంగా ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి టాలీవుడ్ నెంబర్ వన్ సీనియర్ స్టార్ హీరోగా చిరంజీవి రాణిస్తున్నారు. ఇక అలాంటి వ్యక్తికి కొడుకుగా పుట్టలేదని ఎంతోమంది హీరోలు బాధపడుతూ ఉంటారు. కానీ.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాత్రం చిరంజీవికి కొడుకుగా పుట్టకపోవడమే మంచిదంటూ షాకింగ్ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఇంతకీ అసలు రామ్ అలాంటి కామెంట్స్ ఎందుకు చేశారో.. దాని వెనుక కారణాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. తాజాగా.. రామ్ పోతినేని – జగపతిబాబు టాక్ షో జయమ్ము నిశ్చయంబురా షోలో సందడి చేశాడు.
ఇందులో భాగంగానే రామ్ మాట్లాడుతూ.. తమ ఆస్తులు కోల్పోవడం గురించి, సినిమాల విషయాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. నేను పుట్టిన టైంలో విజయవాడలో కులఘర్షణలు ఎక్కువగా ఉన్నాయని.. దాంతో మాకు ఉన్న ఆస్తి మొత్తం రాత్రికి రాత్రే పోయిందంటూ చెప్పుకొచ్చాడు. అలా.. లగ్జరీగా ఉన్న మా లైఫ్ రోడ్ పైకి వచ్చేసింది. దీంతో.. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్ళాం. విజయవాడలో ఉన్నప్పుడు కేవలం నా బొమ్మలు పెట్టుకోవడానికి ఎంత రూమ్ ఉండేదో.. అంత రూమ్లో మొత్తం కుటుంబమంతా ఉండాల్సి వచ్చింది. అలా చేతిలో ₹1 కూడా లేకుండా మా నాన్న కష్టపడి ఈ పోజిషన్‌కి వచ్చారు. అందుకే ఆయన్ని ఎప్పటికీ గౌరవిస్తా అంటూ వివరించాడు.
ఇక సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నన్ను చిరంజీవి కొడుకుగా పుట్టి ఉంటే బాగుండదని ఎన్నోసార్లు అనుకున్నా. అయితే.. చరణ్ జర్నీ చూశాక నేను చిరంజీవి కొడుకు పుట్టపోవడమే మంచిదైంది అనిపించింది. ఎందుకంటే.. మెగాస్టార్ కొడుకుగా వారసత్వ బాధ్యతలు ఇవ్వడం చాలా కష్టం. ఆ వారసత్వ భారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఎంతగా కష్టపడుతున్నాడో.. ఎంతలా తపన పడుతున్నాడో చూస్తూనే ఉన్నా. అలాంటి భారం మోయడం నావల్ల కానే కాదు. అందుకే.. ఆ భారం నాపై లేదని ఆనందంగా ఫీల్ అవుతున్న అంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవి కొడుకుగా వారసత్వాన్ని కంటిన్యూ చేయడం కోసం చరణ్ తన యాక్టింగ్‌తో ఎంతో కృషి చేస్తున్నాడని వివరించాడు. కానీ అలాంటి భారం నాపై లేకపోవడంతో నేను హ్యాపీగా ఉన్న అంటూ రామ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి.