టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రెజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డ్రాగన్. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. హీరోయిన్‌గా రుక్మిణి వసంత్ మెరవనుంది. ఇప్పటికే.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను భారీ లెవెల్ లో ఆకట్టుకున్నాయి. కాగా.. సినిమాకు ఎన్టీఆర్ నీల్ అనే టెంపరరీ టైటిల్ను పెట్టినా.. ఫ్యాన్స్ మాత్రం సినిమాకు డ్రాగన్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా చాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డ్రాగన్ సినిమా కోసం తారక్ ఇప్పటికే లుక్ మొత్తం మార్చేసిన సంగతి తెలిసిందే. బాడీని పూర్తిగా చేంజ్ చేసేసి బరువు తగ్గి, గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. ప్రశాంత్ నీల్ సైతం సినిమా కోసం భారీగా ప్లాన్ చేశాడని.. నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేయబోతున్నాడు అంటూ టాక్ వైరల్ గా మారింది. ఈ క్రమంలో సినిమాపై ఆడియన్స్ లో అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయి. కాగా తాజాగా ప్రాజెక్టుకు సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఎన్టీఆర్, నీల్ కు మధ్య విభేదాలు వచ్చాయని.. దీనివల్లే డ్రాగన్ సినిమా షూట్ ఆగిపోయింది అంటూ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన డ్రాగన్ సినిమా అవుట్ ఫుట్ ఎన్టీఆర్‌కు అస్సలు నచ్చలేదని.. మొదటి స్కెడ్యూల్ పూర్తి చేసిన తారక్ నిరాశ వ్యక్తం చేసినట్లు టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోని నీల్ స్క్రిప్ట్ కొంచెం ఛేంజ్ చేయమని.. తర్వాత రీ షూట్ మొదలు పెడదామని ఎన్టీఆర్ చెప్పినట్లు టాక్. దీనివల్ల నీల్, ఎన్టీఆర్ మధ్య విభేదాలు తలెత్తాయని మేకర్స్ సైతం ఈ విషయం పైన చర్చలు జరిపినా ప్రస్తుతం ఈ వివేదాలతో సినిమా షూట్ ను కంటిన్యూ చేయలేమని ఫిక్స్ అయ్యారట. దీంతో కొద్ది కాలం డ్రాగన్ ఆపూసినట్లు సమాచారం.