నా అనుకున్న వాళ్లే లైంగీకంగా అలా చేశారు: స్టార్ హీరోయిన్‌

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయ ప్రపంచం. ప్రతి ఏడాది ఇండస్ట్రీలోకి నటినట్లుగా స్టార్ హీరో, హీరోయిన్లుగా ఎదగాలని ఎంతోమంది అడుగుపెడుతూ ఉంటారు. తమ సినిమాల సక్సెస్ కోసం ఎంతగానో కష్టపడతారు. కాగా.. కొన్ని సందర్భాల్లో సినిమాల్లో హీరోయిన్ అవకాశాల కోసం వచ్చిన ఎంతోమంది ముద్దుగుమ్మలు కాస్టింగ్ కోచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. అలా.. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోయిన్ సైతం తాము ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు తమ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నారు. తాజాగా మరో స్టార్ బ్యూటీ తన లైఫ్ లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు ఆయేషా ఖాన్. తాను మాట్లాడుతూ.. నా చిన్నతనం నుంచే లైంగిక వేధింపులను ఎదుర్కొన్నానని.. నా వాళ్ళు అనుకున్న వాళ్ళె న‌న్ను లైంగికంగా ఎంతగానో భాధాంచారని కామెంట్లు చేసింది.

Ayesha Khan Biography, Age, Height, Boyfriend, Family, Career, Net Worth

ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ముఖచిత్రం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఆయేషా.. తర్వాత తెలుగులో పలు సినిమాలో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది ఈ క్రమంలోనే కొన్ని సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. కాగా.. తన సినిమాల విషయంలో మాత్రం ఆడియన్స్ లో ఊహించిన రేంజ్ లో హైప్‌ను క్రియేట్ చేసుకోలేక పోతుంది. ఇలాంటి క్రమంలో తాజా ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ లైంగిక వేధింపుల గురించి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.

Ayesha Khan Age, Wiki Boyfriend, Family Biography, Instagram

అయేషా మాట్లాడుతూ తన చిన్నతనంలోనే వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఒకరు నీ వ‌క్షోజాలు బాగున్నాయంటూ చెప్పాడని.. నేను చిన్నపిల్లను కనుక అప్పట్లో ఆయన చెప్పిన మాటలు నాకు అర్థం కాలేదు అంటూ వివరించింది. అలాగే.. ఆ వ్యక్తిని నేను బాబాయ్ అని పిలిచే దాన్ని. కానీ.. ఆయన మాత్రం నన్ను చెడు దృష్టితో చూసేవాడు అంటూ వివరించింది. తర్వాత.. ఒకసారి నన్ను చూసి కన్నుకొట్టి బ్యాడ్ వ‌ర్డ్స్‌ మాట్లాడాడని.. దాంతో నేను చాలా సేపటి వరకు ఏడుస్తూ కూర్చుని పోయా అంటూ వివరించింది. ఏదేమైనా.. నా చిన్నప్పటి నుంచి నా అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే నేను ఇలాంటి వేధింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక.. ఇండస్ట్రీలో అయితే అది సర్వసాధారణంగా మారిపోయింది. నేను ఎన్నో ఎదుర్కొన్న అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.