పవన్ మూవీలో చేసే ఛాన్స్ వచ్చినా నో చెప్పేస్తా.. కిరణ్ అబ్బవరం షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం తాజాగా కే – రాంప్‌ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో.. ఆడియన్స్‌లో పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. కిరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ కాయమంటూ టాక్‌ నడుస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన‌ర్‌గా వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న‌ ఆడియన్స్ ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్ ని దక్కించుకున్న‌ క్రమంలో దీపావళి విన్నర్ కే – రాంప్‌ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం అన్ని రకాలుగా ప్రమోషన్స్ చేస్తూ ఖచ్చితంగా సినిమా ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయన అన్నట్లుగానే సినిమా ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ ద‌క్కించుకుంది.

Kiran Abbavaram K-Ramp First Look Is Out Announcing Diwali Release |  cinejosh.com

ఈ క్రమంలోనే.. కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పవన్ గురించి కిరణ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కే – రాంప్‌ ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కిరణ్ మాట్లాడుతూ.. యాంకర్ అడిగిన ప్రశ్నకు షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. ఇంటర్వ్యువర్ మాట్లాడుతూ మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం కదా.. ఆయన సినిమాల్లో నటించే అవకాశం వస్తే.. చేస్తారా అని అడగగా.. దానికి కిరణ్ అబ్బ‌వరం షాకింగ్ సమాధానం చెప్పుకొచ్చాడు. నాకు.. పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను కూడా. కానీ.. ఆయన సినిమాల్లో ఇప్పుడు నేను చేయలేను. ఒకవేళ అవకాశం వచ్చినా చేయను. ఎందుకంటే.. నేను హీరోగా నా కెరీర్ బిల్డ్‌ చేసుకునే పనిలో ఉన్నా.

Kiran Abbavaram: పవన్ సినిమాలలో అసలు నటించను...అభిమాని అయితే నటించాలా? -  BigTvLiveఇలాంటి టైంలో.. క్యారెక్టర్స్ అంటే చేయడం కష్టం. ప్రజెంట్ నా ఫోకస్ అంతా.. నా సినిమాలు, నా మార్కెట్ పైనే ఉంది. ఒకవేళ అవకాశం వచ్చిన ఈ క్యారెక్టర్ కిరణ్ అబ్బవరం అయితేనే చేయగలడు అనేలా రోల్ ఉంటేనే చేస్తా. కానీ.. పవన్ సినిమాలో కనిపించాలని మాత్రం సినిమాలో నటించనంటూ కిరణ్ అబ్బ‌వరం చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. కాగా.. కిరణ్ చెప్పిన ఈ ఫెయిర్‌ ఆన్సర్‌ను అంతా సపోర్ట్ చేస్తున్నారు. ఏదైనా ఇలా నిజాయితీగా చెప్పడం చాలా గొప్ప విషయం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలామంది హీరోలు.. ఇలాంటి విషయంలో కాస్త తప్పించుకోవడానికి.. లేదా కాకా పట్టడానికి ట్రై చేస్తారు. కానీ.. కిరణ్ మాత్రం అలాంటి తప్పించుకునే సమాధానాలు కాకుండా జెన్యూన్ గా తనకు అనిపించిన సమాధానాన్ని చెప్పాడంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.