టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ మూవీ కే – ర్యాంప్. కిరణ్ హీరోగా.. యుక్తి తరేజా హీరోయిన్గా మెరిసిన ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకుడుగా వ్యవహరించారు. ఇక దీపావళి సందర్భంగా అక్టోబర్ 18న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా.. పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో కిరణ్ అబ్బవరం చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమా ప్రెస్ మీట్లో కిరణ్ మాట్లాడుతూ.. సినిమా హెవీ ఎంటర్టైనర్ అని చెబుతూనే వస్తున్నా. మేము చెప్పినట్లు థియేటర్స్లో దీపావళి పండుగను.. సినిమా చూసి ఆడియన్స్ సెలబ్రేట్ చేసుకుంటారని నమ్మకం మాకు ఉంది. నవ్వించే సినిమా ఎప్పుడు డిసప్పాయింట్ చేయదు. ఇక ఈరోజు నాలుగు సినిమాల రిలీజ్ అయ్యాయి. కానీ.. మాకు 17 డేట్ సెంటిమెంట్ ప్రకారం కలిసి రాదని.. 18కి వచ్చాం.
శుక్రవారం రిలీజ్ కు వచ్చి ఉంటే నాలుగు రోజులు హాలిడేస్ కావడంతో మరో రోజు కలెక్షన్లకు మాకు అవకాశం ఉండేది. కానీ.. శనివారమే రిలీజ్ చేస్తున్నాం. ఇక థియేటర్లో ఆడియన్స్ అంతా సినిమా బాగుంది.. మంచి ఎంటర్టైనర్ అని చెప్తే ఫ్యామిలీ ఆడియన్స్ కచ్చితంగా క్యూ కడతారంటే ధీమా వ్యక్తం చేశాడు. ఈ సినిమా చాలా ఏరియాల్లో ప్రమోషన్స్ జరుపుకున్నాం. గ్రాండ్ లెవెల్లో సినిమా గురించి బజ్ క్రియేట్ అయింది. మేమంతా సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాం అంటూ కిరణ్ అబ్బవరం చెప్పుకొచ్చాడు. ఇక.. ఈ సినిమా కంటే ముందు దీపావళి కానుకగా మిత్రమండలి, తెలుసుకదా, డ్యూడ్ సినిమాలు సైతం రిలీజ్ అయ్యాయి.
ఈ సినిమాల తర్వాత వచ్చిన కె – ర్యాంప్ ఆడియన్స్లో ప్రస్తుతం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంటుంది. ఇక.. సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసింది ఆడియన్స్ అని.. కచ్చితంగా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తే ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడతారు అంటూ కిరణ్ అబ్బవరం ప్రెస్ మీట్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. సినిమాకు పాజిటీవ్ టాక్ రావడమే కాదు.. కిరణ్ సినిమాలో చెప్పిన ప్రతి ఒక్క డైలాగ్ ఆడియన్స్ను బాగా కనెక్ట్ చేస్తుందని.. సినిమా మొత్తానికి ఆయన రోల్ హైలెట్ గా మారిందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అంటుకుంటుంది.. దీపావళి విన్నార్గా నిలుస్తుందా.. లేదా.. చూడాలి.