‘బాహుబలి… ది ఎపిక్ 2025’ విడుదల వెనుక లాయిడ్ గ్రూప్ అధినేత..?

ఇదేదో లాయిడ్ గ్రూప్ అధినేత ‘బాహుబలి- ది ఎపిక్2025’ విడుదల వెనుక ఉన్నారంటే… ఆ సినిమాని తను రిలీజ్ చేస్తున్నాడేమో అనుకునేరు. లేదా… ఈ సినిమాకి కావాల్సిన ఏమైనా ఆర్థిక వ్యవహారాలను అందిస్తున్నారేమోనని పొరపాటు పడేరు. అదేమీ కాదు… ఈ సినిమా రెండు పార్టులుగా గతంలో విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో… అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమా రెండు పార్టులు కలిపి ఇప్పుడు ఒకే పార్టు కింద ‘బాహుబలి- ది ఎపిక్2025’ పేరుతో ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను దర్శకుడు పూర్తి చేశారు.

దాని రన్ టైమ్ కూడా ఎంతనో చెప్పేశారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే… బాహుబలి2 విడుదలైన వారానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ.. మే 6వ తేదీ 2017న ఓ పోస్ట్ వేశాడు. అంటే.. బాహుబలి2 విడుదలైన (ఏప్రిల్ 28, 2017) వారం రోజులకు ట్వీట్ చేశారన్నమాట. ‘ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే… ’రాజమౌళి గారు… బాహుబలి పార్ట్ 1,2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం.

Baahubali: The Epic - Wikipedia

ఈ అద్భుతం తో మళ్లీ తక్కువలో తక్కువగా రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు’ అని ట్వీట్ వేశారు. తన వ్యాపార సామర్థ్యాలతో లాయిడ్ గ్రూప్ అధినేతగా ఎదిగిన ఆయన… తన ముందు చూపు ఆలోచ‌న‌లతో రెండు పార్టులుగా విడుదలైన ఓ సినిమాను ఒకే పార్టుకింద విడుదల చేయండని ఏడేళ్ల క్రితం తను ట్విట్టర్ లో పంచుకున్న అభిప్రాయం ఇప్పుడు నిజం అవుతున్నందుకు చాలా సంతోషపడుతున్నారు. ఏడేళ్ల‌ క్రిత‌మే చేసిన ఈ ఆలోచ‌న‌పై ఆయనను అభినందిస్తున్నారు. అటు వ్యాపార రంగంలోనే కాదు ఇటు సినిమా రంగంలోనూ విజ‌న్ ఉన్న వ్యాపారవేత్తగా విక్రం నారాయణ రావు గారిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.