మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక సినిమా సంక్రాంతి బరిలో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈఅ మూవీలో నయనతార హీరోయిన్గా మెరవనుంది. ఇక.. ఈ సినిమాతో పాటే.. మెగాస్టార్ లైనప్‌లో ఉన్న విశ్వంభర సినిమా సైతం.. నెక్స్ట్ సమ్మర్‌లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక.. సినిమాలో మరో సీనియర్ స్టార్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా కనిపించనుంది. ఇక.. ఈ రెండు సినిమాల పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత.. చిరంజీవి, బాబి డైరెక్షన్‌లో సినిమా సెట్స్ లో అడుగు పెట్టనున్నాడని సమాచారం.
ఇప్పటికే స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయిపోయాయని.. నవంబర్ నుంచి సినిమా షూట్ ప్రారంభించినట్లు తెలుస్తుంది. గతంలో.. చిరంజీవితో వాల్తేర్ వీరయ్య సినిమా తెరకెక్కించి హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో వింటేజ్ చిరు కామెడీ టైమింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న బాబి.. ఈసారి మాత్రం ఫుల్ మాస్‌లో చూపించాలని బాబి ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలోనే ఫస్ట్ లుక్ తోనే దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. చిరంజీవి బర్త్డే రోజున గొడ్డలి వేటు.. రక్తం కారుతున్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి మెగా ఫాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు. ఇక మెగాస్టార్ కు బాబి మొదటి నుంచి అభిమాని కావడంతో.. ఫ్యాన్స్ అంతా కోరుకున్న రేంజ్లో ఊర మాస్‌గా చిరును చూపించాలని ఫిక్స్ అయ్యాడట. అయితే.. సినిమాలో హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. సీనియర్ హీరోల సినిమాల్లో చేస్తే.. కెరీర్ కతమవుతుందని కాన్సెప్ట్ ఎప్పటి ముగిసిపోయింది.
ఈ క్రమంలోనే హీరో ఏజ్‌తో సంబంధం లేకుండా మంచి కథ ఉన్న సినిమాలో నటించాలంటే ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మెగాస్టార్ సినిమా కోసం ఒకరు కాదు.. ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు వైరల్ గా మారుతున్నాయి. అందులో ఒకరు రాసి ఖన్నా. మరొకరు మాళవిక మోహన్ అంటూ సమాచారం. చాలా కాలం లాంగ్ బ్రేక్ తర్వాత.. రాశి ఖన్నా మరోసారి తెలుగు ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా మూవీలో అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో రాశిఖన్నా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇప్పుడు మరోసారి చిరు సినిమా డిస్కషన్స్ లోనూ అమ్మడి పేరు వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. రాజాసాబ్ సినిమాల్లో ప్రభాస్ తో రొమాన్స్‌కు సిద్ధమైన మాళవిక మోహన్ సైతం మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ నడుస్తుంది. మరి ఫైనల్‌గా ఈ సినిమాలో మెగాస్టార్ సరసన మెరవనున్న ఆ ఫిగర్ ఎవరో వేచి చూడాల్సిందే.