టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇక.. మొదటి నుంచి ఎన్టీఆర్ ఓ సినిమాను సెలెక్ట్ చేసుకున్నాడంటే కచ్చితంగా.. సినిమాలో కంటెంట్‌తో పాటు.. ఎమోషన్స్, యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని సమపాళల్లో ఉంటాయని అభిమానులు ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలోనే.. ఎన్టీఆర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అంచనాలు ఆకాశానికి అంటుతాయి.
ఇక.. తారక్ కెరీర్ ప్రారంభంలో ఆది సినిమా నుంచి నిన్న మొన్న రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ సినిమా వరకు ప్రతి ప్రాజెక్టులోను ఎన్టీఆర్ ఓ వైవిధ్యమైన క్యారెక్టర్ ను చూపిస్తూ వచ్చాడు. ఇక.. ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో అంతకుమించి పోయే రేంజ్ లో తనను తాను ఎలివేట్ చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. కేజిఎఫ్, సలార్ లాంటి మాస్ బ్లాక్ బస్టర్లతో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను బ్లాస్ట్ చేసిన నీల్.. ఈసారి ఎన్టీఆర్ కోసం మరింత వైల్డ్, ఇంటెన్స్ కథ ప్లాన్ చేశాడట. ఇలాంటి క్రమంలో.. సినిమాపై మరింత ఆసక్తిని పెంచే ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సినిమాలో తారక్‌కు ఓ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ ఉంటుందని.. అది చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో ఎన్టీఆర్ ఫుల్ ఆఫ్ రఫ్, రగడ్ లుక్ లో కనిపించనున్నాడట.
ఆయన యాక్షన్ సీన్స్.. ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించడం ఖాయమని.. సీట్ ఎడ్జ్ వరకు తీసుకెళ్తాయంటూ టాక్ వైరల్ గా మారుతుంది. అంతేకాదు.. సినిమాల్లో యాక్షన్ ఏ కాకుండా.. ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండనున్నాయని సమాచారం. ప్రశాంత్ నిల్ ఇప్పటివరకు తెరకెక్కించిన ప్రతి సినిమాలోను మాస్ ఎలిమెంట్స్‌తో పాటే.. హార్ట్ టచ్ చేసే.. ఎమోషన్ సీన్స్ చేస్తూ వచ్చాడు. అదే రేంజ్లో మ్యాజిక్ ఈ సినిమాకు కూడా వాడనున్నాడట. నిజంగానే.. ఇవన్నీ జరిగి సినిమాకు వర్కౌట్ అయితే మాత్రం.. డ్రాగన్ బ్లాక్ బస్టర్ కొట్టడం కాదు.. రికార్డుల సునామీ సృష్టిస్తుందంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక.. సినిమా కోసం కేవలం ఎన్టీఆర్ అభిమానులే కాదు. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.