పాన్ ఇండియన్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్‌కు ప్రత్యేక పరచయాలు అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌గా దూసుకుపోతున్న ఈ సంస్థ.. తెలుగుతో పాటు.. మలయాళం, తమిళ్, హిందీ భాషల్లోనూ భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తూ పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్‌లు అందుకుంటుంది. ఇక పుష్ప, పుష్ప 2, రంగస్థలం, శ్రీమంతుడు లాంటి ప్రతిష్టాత్మక సినిమాలతో ఇప్పటికే మంచి సక్సెస్‌లు అందుకున్నారు.
అయితే.. 10 ఏళ్లకు పైగా ప్రయాణంలో ఎన్నో సినిమాలను తెరకెక్కించిన మైత్రి టీం.. తాజాగా చేసిన కామెంట్స్ అందరికి షాక్‌ను కలిగిస్తున్నాయి. తమ కొత్త సినిమా డ్యూడ్ విషయంలో మైత్రి మేకర్స్ మాట్లాడుతూ.. పదేళ్లుగా ఉన్న మా ప్రయాణంలో.. ఎన్నో సినిమాలు చేసినా రాని.. ఒక సంతృప్తి మా కొత్త సినిమా డ్యూడ్ విషయంలో వచ్చిందంటూ వెల్లడించారు. తాజాగా నిర్మాతరవిశంకర్ ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాకు.. నాలుగు విషయాలు చాలా చక్కగా కుదిరాయంటూ వివరించాడు రవి శంకర్.
అదిరిపోయే సబ్జెక్టుతో సినిమా షూటింగ్ మొదలెట్టం.. 65 నుంచి 75 రోజుల్లో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో పూర్తి చేయడం.. అనుకున్న బడ్జెట్లో సినిమా అయిపోవడం.. అన్నింటికంటే మించి అదిరిపోయే ఔట్పుట్ వచ్చింది. సినిమా బలే తీశామని పిచ్చా ఎక్సైజ్మెంట్ కలిగింది అంటూ రవిశంకర్ వివరించాడు. దాదాపు 10 ఏళ్ల నుంచి ఈ అంశాలన్నీ కుదిరే పర్ఫెక్ట్ సినిమా కోసం అన్వేషిస్తున్నాం. ఎట్టకేలకు అది వర్కౌట్ అయిందంటూ రవిశంకర్ వివరించాడు. మైత్రి సంస్థలు ఇప్పటికే 30 కి పైగా సినిమాలు తెరకెక్కించగా ఈ సినిమాలకు సుక్కుమార్ సహ సలువురు స్టార్ డైరెక్టర్లు పనిచేశారు. ఇలాంటి క్రమంలో డ్యూడ్ ను ప్రసంసిస్తు మిగతా వారికి కౌంటర్ వేసినట్లు ఆ కామెంట్స్ ఉన్నాయంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.