నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బాలయ్య కూడా తన డబ్బింగ్ పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా థమన్ వ్యవహరిస్తుండగా.. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రూపొందింది, ఇక గతంలో థమన్ అఖండకు ఇచ్చిన బిజిఎంతో థియేటర్స్ లో బాక్సులు కూడా బద్దలయ్యాయి. ఇప్పుడు.. అఖండ 2కు అంతకు మించిపోయే రేంజ్‌లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఉండనుందని.. దానికోసమే థమన్ రాత్రి పగలు కష్టపడుతున్నాడంటూ టాక్ నడుస్తుంది.
ఇక.. సినిమాకు మొదట అనుకున్నా షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ చేయాల్సి ఉండగా థమన్.. ఈ సినిమా మ్యూజిక్ లేట్ చేయడంతో అఖండ 2 రిలీజ్ పోస్ట్‌పోన్ అయిపోయిందట. ఈ సినిమా కోసం థమన్ అందించే బిజిఎం ఎలా ఉండబోతుందో అని అభిమానులతో పాటు.. కామన్ ఆడియన్స్ లోను ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే సినిమా థియేట్రికల్ ప్లస్ ఓటిటి, శాటిలైట్ రైట్స్‌కు సంబంధించిన బిజినెస్ వివరాలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. బాలయ్య కెరీర్‌లోనే నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని సమాచారం. తెలంగాణలో రూ.36 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.55 కోట్లు, సిడెడ్‌లో రూ.24 కోట్లు, నార్త్ అమెరికా.. ఓవర్సీస్ రైట్స్ అన్నిటిని కలుపుకొని రూ.31 కోట్లు అంటే.. 3.5 యుఎస్ డాలర్లకు సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరిగాయట.
మొత్తంగా ఈ సినిమాతో బాలయ్య కెరీర్‌లోనే హైయెస్ట్ థియేట్రికల్ బిజినెస్ జరిగిన రికార్డ్ క్రియేట్ అయింది. దాదాపు రూ.146 కోట్ల మేరా ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగడం విశేషం. ఇక.. ఐదు భాషలకు కలిపి ఓటీటీ హక్కులు రూ.140 కోట్లకు అమ్ముడుపోయాయని.. శాటిలైట్ హక్కులు రూ.60 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు.. మ్యూజిక్ రైట్స్ రూ.8 కోట్లకు అమ్ముడుపోయిందట. ఇలా.. మొత్తం కలిపి రూ.152 కోట్లకు హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే థియేట్రికల్, నాన్ థియేటర్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ రూ.318 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది. అసలు థియేట్రికల్ బిజినెస్‌తో సంబంధం లేకుండానే.. మేకర్స్‌కు రూ.172 కోట్ల టేబుల్ ప్రాఫిట్ దక్కింది. ఇక.. ఇది బాలయ్య సినీ కెరీర్‌లోను మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ ఓటీటీ హక్కులను నెట్లెక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. అంతేకాదు.. ఈ సినిమాలో అసలు విశేషం ఆఖండ 2.. హిందీ, కన్నడ, తమిళ్ వర్షన్‌కు బాలయ్య స్వయంగా డబ్బింగ్ చెప్పడం.. ఈ సినిమాలో విలన్‌గా ఆదిపనిశెట్టి నటించగా.. పహల్గాం ఎపిసోడ్ కూడా సినిమాల్లో యాడ్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే.. అఖండ 2తో బాలయ్య ఈ కెరీర్‌కు ఎలాంటి ఎండ్ కార్డ్ వేస్తాడని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.