ఒకప్పుడు టాలీవుడ్‌లో తన సినిమాలతో సంచలనం సృష్టించిన.. డైరెక్టర్ తేజకు ఆడియన్స్ లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వైవిధ్యమైన ప్రేమ కథలతో సినిమాలను తెరకెక్కించి ఆడియన్స్ కు కనెక్ట్ అయిన తేజ.. ఎన్నో సూపర్ సక్సెస్ లను అందుకున్ని దర్శకుడుగా తన సత్తా ఏంటో చూపించాడు. ఈ క్రమంలోనే.. తేజ డైరెక్షన్‌లో సినిమా అంటే.. మినిమం హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఆడియన్స్‌లో కలిగేది. కానీ.. ఇప్పుడు సరైన కంటెంట్‌తో ఆడియన్స్‌ను మెప్పించలేక వరుసగా ఫెయిల్యూర్లను ఎదుర్కొంటున్నాడు.అలా చివరిగా.. అహింస సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు. సురేష్ దగ్గుబాటి చిన్న కొడుకు.. రానా తమ్ముడు.. అభిరామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను మెప్పించలేకపోయింది.
ఈ సినిమా తర్వాత తేజ నుంచి మరే సినిమా రాలేదు. ఈ క్రమంలోనే తాజాగా డైరెక్టర్ తేజకు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ క్లిప్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇందులో తన కొడుకు మరణానికి సంబంధించిన షాకింగ్ విషయాన్ని రివిల్ చేశాడు తేజ. ఓ నిర్మాత తన చిన్న కొడుకు చనిపోవడానికి కారణం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తన చిన్న కొడుకు ఆరోవ్ తేజ అనారోగ్యంతో బాధపడుతున్నారు.. మెదడు, శ్వాస సంబంధించిన సమస్యలతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో.. కొడుకుని ఎలా కాపాడుకోవాలో తెలియక నేను టెన్షన్ పడుతున్నా. అదే టైంలో.. ఓ ప్రొడ్యూసర్ వచ్చి తనకు ఇవ్వాల్సిన కోటి రూపాయలు అప్పు తీర్చమంటూ వేధించాడని.. నేను సినిమా చేస్తే మీ అప్పు తీరుస్తాను.
కానీ.. మా అబ్బాయి చావు బ్రతుకుల్లో ఉన్నాడు.. అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి.. జర్మనీ తీసుకువెళ్లాలి అంటూ ఆ నిర్మాతకు ఎంతగానో బ్రతిమలాడుకున్నానని డైరెక్టర్ తేజ చెప్పుకొచ్చాడు. డబ్బుల కోసం తన ఇంటిని ఆ నిర్మాతకే తాకట్టు పెట్టానని.. రూ.3 కోట్లకు ఆ ఇంటిని అగ్రిమెంట్ రాయించుకున్నాడు.. డబ్బులు తీసుకువచ్చి హాస్పటల్ టేబుల్ పై పెట్టి నాతో, నా భార్యతో సైన్ చేయించుకున్నారు. ఇక అలా పెట్టి అగ్రిమెంట్ తీసుకుని వెళ్లారో.. లేదో.. నిర్మాత వచ్చి డైరెక్ట్ గా నా డబ్బులు ఇస్తారా సార్ అని చెప్పి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ వివరించాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఇల్లుని ఆక్రమించుకునే ప్రయత్నాలు చేశారు. చాలా రకాలుగా ఇబ్బంది పడ్డా. ఓ వైపు సినిమాలు లేవు, మరోవైపు కొడుకు అనారోగ్యం, మరోవైపున వీళ్ల టార్చర్ అసలు ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయిందంటూ ఎమోషనల్ అయ్యాడు.
ఇక చేసేదేం లేక మరో ఇంటిని తాకట్టు పెట్టి కొంత అడ్వాన్స్ తీసుకొని కొడుకుని విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించా.. ఆ తర్వాత నా కొడుకుని సెకండ్ లెవెల్ ట్రీట్మెంట్కు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు కూడా ఇలాంటిదే కంటిన్యూ అయిందంటూ చెప్పుకొచ్చాడు. మళ్ళీ.. కేసు పెట్టి తిప్పించారు.. దాని కారణంగా సరైన ట్రీట్మెంట్ ఇప్పించలేక కొడుకుని కోల్పోవాల్సి వచ్చింది అంటూ డైరెక్టర్ తేజ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంతేకాదు నిర్మాత పేరును కూడా తేజ రివిల్ చేశాడు. ఆ నిర్మాత మరెవరో కాదు చదలవాడ శ్రీనివాస రావే అంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇప్పుడు తేజ ఇంటర్వ్యూ నెటింట వైరల్ గా మారడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. ప్రొడ్యూసర్ కారణంగా ఇంత నరకాన్ని చూసాడా అంటూ షాక్ అవుతున్నారు.