బన్నీ కారణంగా అల్లు అరవింద్ కు బిగ్ లాస్..!

ఇండస్ట్రీలో ఎలాంటి కథ అయినా.. రిలీజై ఆడియన్స్ నుంచి టాక్ వచ్చేవరకు.. రిజల్ట్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. కానీ.. సినిమా కథను డైరెక్టర్ చెప్పిన విధానాన్ని బట్టి.. హీరోలు, నిర్మాతలు సినిమా సక్సెస్ అవుతుందని నమ్ముతుంటారు. కొన్ని సందర్భాల్లో కథ‌ ఎక్కడైనా డౌట్ అనిపిస్తే వెంటనే దాన్ని సున్నితంగా రిజెక్ట్ చేస్తారు. మరి కొన్ని సినిమాల విషయంలో మాత్రం డైరెక్టర్ చెప్పినప్పుడే డౌట్ అనిపించినా.. ఏవో కార‌ణాల‌తో.. చిన్న నమ్మకంతో సినిమా తీస్తారు. కానీ.. తీరా ముందనుకున్న రిజల్ట్ వచ్చి సినిమా డిజాస్టర్ గా నిలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా.. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు కూడా.. ఓ సినిమా విషయంలో భారీ బొక్క పడిందట. అది కూడా.. ఆయన కొడుకు బన్నీ కారణంగానే ఇదంతా జరిగిందంటూ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు అల్లు అరవింద్.

Allu Aravind: There's high chances Sai Pallavi and Naga Chaitanya will win  the National Award for Thandel

ఇంతకీ.. ఆ సినిమా ఏంటి.. అసలు సినిమా లాస్‌కు.. అల్లు అర్జున్‌కు కనెక్షన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. అల్లు అర్జున్.. ఆర్య సినిమా నుంచి తన కెరీర్ గాడిలో పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక తన‌ సినీ కెరీర్‌లో ఇప్పటి వరకు.. ఎన్నో విభిన్నమైన పాత్రలో మెరిసాడు. అలా.. తన కెరీర్లో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాల్లో బద్రీనాథ్ కూడా ఒకటి. ప్రముఖ డైరెక్టర్ వివి వినాయక రూపొందించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా మెరిసింది. 2011లో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. అయితే.. సినిమా కథను విన్న అల్లు అరవింద్.. మొదట దాన్ని రిజెక్ట్ చేశాడట. ఎక్కడో తేడా కొడుతుందని ఆయన భావించాడు. కానీ.. అల్లు అర్జున్‌కు మాత్రం కథ నచ్చేసింది. ఇందులో యాక్షన్ సీన్స్ భారీగా ఉండడంతో.. కచ్చితంగా సినిమా సక్సెస్ అవుతుందని.. తన తండ్రి అరవింద్ కు చెప్పి మరి ఒప్పించాడట.

Badrinath | Rotten Tomatoes

ఈ క్రమంలోనే.. సినిమాకు మొదట అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ కూడా అయింది. అప్పుడు.. బన్నీ మార్కెట్ సినిమా బడ్జెట్ కంటే చాలా తక్కువే కావడంతో.. సందేహం ఉన్న సరే అని.. సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. రిలీజ్ తర్వాత సినిమా అనుకున్నట్లుగా ఫ్లాప్ అయ్యింది. హై క్లాస్ విజువల్స్, అవుట్‌డోర్ భారీ సెట్టింగ్.. స్టార్ కాస్టింగ్ ఉండడంతో.. సినిమా భారీ మొత్తమే ఖర్చయింది. దీంతో.. బద్రీనాథ్ మూవీ కారణంగా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రే.40 కోట్ల నష్టాన్ని చూసారట. ఆయనకు తగిలిన అతిపెద్ద షాక్ అదేనని ఈ అనుభవంతో కొన్ని రోజులపాటు భారీ బడ్జెట్ సినిమాల జోలికి కూడా వెళ్లలేదంటూ స్వయంగా అరవింద్ వివ‌రించారు. అయితే.. సినిమా కెరీర్‌లో ఇలాంటివి అప్పుడప్పుడు కామన్ గానే జరుగుతాయి. అవి మనకే మంచి చేస్తాయి. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుందంటూ అల్లు అరవింద్ వివరించారు.