సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది కొత్త కొత్త హీరో, హీరోయిన్లు అడుగుపెడుతూ ఉంటారు. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్లుగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్లుగా మారినా.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు మాత్రం తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు. తమ అందం, అభినయంతోపాటు.. సింపుల్ నేచర్, మాట్లాడే విధానంతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు.
అలా ప్రస్తుతం.. టాలీవుడ్ టాప్ రేంజ్ లో ఉన్న చాలా మంది హీరోయిన్స్ కన్నడ బ్యూటీసే కావడం విశేషం. ఇప్పటివరకు కన్నడ నుంచి ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో తమ సత్తా చాటుకున్న ముద్దుగుమ్మల్లో.. ప్రజెంట్ రష్మిక పేరు ఎక్కువగా వినిపిస్తుంది. కన్నడలో చిన్న సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం నేషనల్ లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు.. ఆ రేంజ్ సక్సెస్ అందుకోవడానికి తన నటన, అందం మాత్రమే కాదు అభిమానులతో.. ఆమె మాట్లాడే తీరు ఫ్యాన్స్‌ను ట్రీట్ చేసే సింపుల్ నేచర్ కూడా ఓ కారణం అనడంలో అతిశయోక్తి లేదు.
ఎంత బిజీ స్కెడ్యూల్‌లో ఉన్న.. రష్మిక సోషల్ మీడియాలో మాత్రం తన అభిమానులతో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది. చిన్న విషయం అయినా అందరితోనూ పంచుకుంటూ.. ఫ్యాన్స్ కు ఓ పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే.. అమ్మడిని అభిమానించే వారు సైతం పెరుగుతూ వస్తున్నారు. ఈ విషయంలో శ్రీ లీల సైతం రష్మికను ఫాలో అవుతుందంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక.. శ్రీ లీల సైతం కన్నడ బ్యూటీ అన్న సంగతి తెలిసిందే. అతి తక్కువ సమయంలోనే.. ఇండస్ట్రీలో హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. సినిమా హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటుంది.
కెరీర్ ప్రారంభంలో ఫాన్స్ కు పెద్దగా టచ్ లో లేకపోయినా.. మెల్లమెల్లగా అభిమానులకు దగ్గర అవడానికి ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవ్వడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలోని తాజాగా షూటింగ్ గ్యాప్ లో ఫ్యాన్స్ తో ముచ్చటించి వాళ్లకు ఫుల్ ట్రీట్ ఇచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చాలామంది హీరోయిన్స్ హార్డ్ వర్క్ ఒక అరకు అడ్రస్ గా ఉంటున్నారు కలర్ తో సంబంధం లేకుండా తమనాటనతో హార్డ్ వర్క్ తో అందరిని ఫిదా చేస్తున్నారు. ఇప్పుడు రష్మిక , శ్రీ లీల కూడా ఇదే విధంగా తమ కెరీర్‌ను రన్ చేస్తున్నారు. కేవలం సినిమాల విషయమే కాదు.. చదువు, ఫ్యామిలీ ఇలా అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ అందరిని తమ వైపు తిప్పుకుంటున్నారు.