సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకునేవాళ్లంతా.. ఒకే టైంలో ఎక్కువ సినిమాలను కమిట్ అవ్వడం కామన్. టాలీవుడ్ లో ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా.. స్టార్ హీరోస్ అంతా ఒకరి తర్వాత ఒకరు తమ ప్రస్తుతం చేస్తున్న సినిమాలే కాకుండా నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం వీళ్ళు కమిట్ అయ్యే సినిమాలన్నీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలే కావడం.. ఒక్కో సినిమా పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం అయినా పడుతుండటంతో.. ఫ్యూచర్‌లో కమిట్ అయిన ప్రాజెక్టులలో ఏ సినిమా ముందు చేస్తారు.. ఏ సినిమా వెనక చేస్తారని కన్ఫ్యూజన్ అందరిలోనూ మొదలవుతుంది. ఒక్కోసారి.. కమిట్ అయిన ప్రాజెక్ట్ సైతం అసలు సెట్స్‌పైకి వెళ్తుందా.. లేదా.. అనే సందేహాలు కూడా ఆడియన్స్‌లో మొదలైపోతున్నాయి. ముఖ్యంగా.. ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఈ సందేహాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి.
తాజాగా.. తారక్ ఓ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసాడు అంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఈ ఏడాది వార్ 2 సినిమాతో ఆడియన్స్ పలకరించిన ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత కొరటాల శివతో దేవర 2 సినిమా చేయాల్సి ఉంది. అలాగే త్రివిక్రమ్, నెల్సన్ ప్రాజెక్ట్‌లు.. దాదా సాహేబ్ ఫాల్కే బయోపిక్‌లోను తారక్ నటించిన క్రమంలో.. తారక్ డ్రాగన్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత.. సెట్స్‌పైకి దేవర 2 కచ్చితంగా చేస్తానని ఎన్టీఆర్ చెప్పినా.. అసలు ఆ సినిమా ఉంటుందో లేదో అనే సందేహాలు కూడా ఇప్పటికీ వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి క్రమంలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తారక్ వదిలేసుకున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. దాదాపు రెండు నెలల క్రితం రాజమౌళి సమర్పణలో ఈ బయోపిక్‌ను మేడ్ ఇన్ ఇండియా టైటిల్‌తో అఫీషియల్‌గా ప్రకటించారు.
బాలీవుడ్ డైరెక్టర్ నితిన్ కక్కర్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించనున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా బయోపిక్ కావడం తారక్ హీరో అంటూ వార్తలు వినిపించడంతో.. ఆడియన్స్‌లో సినిమాపై మంచి ఆసక్తి నెలకొంది. ఇలాంటి క్రమంలో తారక్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఈ ప్రాజెక్టు నుంచి తను తప్పుకున్నట్లు టాక్. వార్ 2తో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఫ్లాప్ ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. హిందీ దర్శకుల విషయంలో జాగ్రత్త పడాలని తారక్ భావిస్తున్నాడట.. పైగా ఇప్పటికే పలు సినిమాలను లైనప్ కూడా ఉంది. ప్రతి సినిమాకు తగ్గట్టుగా అప్పటికప్పుడు తారక్ లుక్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే.. ఇతర సినిమాలు చేయడం అస్సలు వర్కౌట్ కాదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. మేడ్ ఇన్ ఇండియా సినిమాను చేయలేని ఎన్టీఆర్ చెప్పేసినట్లు సమాచారం. ఈ క్రమంలోని మేడ్ ఇన్ ఇండియా టీమ్ సైతం ప్రజెంట్ ప్రాజెక్టును హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తుంది.