మోహన్ బాబు యూనివర్సిటీకి బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్‌ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్.. మోహన్ బాబు యూనివర్సిటీకి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇటీవల కాలంలో యూనివర్సిటీ ఎన్నో రకాల వివాదాలను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి యూనివర్సిటీకి బిగ్ షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ్.. మానిటరింగ్ కమిషన్ విచారణ ప్రారంభించారు. పేరెంట్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు.. ఇన్వెస్టిగేషన్‌ ను మొదలుపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు వివరించారు.

గత మూడు ఏళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించే విద్యార్థుల నుంచి.. ఫీజుల రూపంలో రూ.27 కోట్ల అదనంగా డబ్బులు వసూళ్లు చేశారని అధికారులు ఇన్వెస్టిగేషన్‌లో తేల్చారు. ఈ విషయంపై విచారణ జరిపిన ఏపీ ఉన్నత విద్యా రెగ్యులేటరీ అండ‌€్ మానిటరింగ్ కమిషన్.. రూ.15 లక్షల ఫైన్ ను విధించింది. ఆ మొత్తాన్ని మోహన్ బాబు యూనివర్సిటీ చెల్లించారు. యూనివర్సిటీ గుర్తింపుని రద్దు చేయాలని ఉన్నత విద్యా కమిషన్ ఏపీ ప్రభుత్వానికి రికమెండ్ చేయడం ఇప్పుడు మోహన్ బాబుకు బిగ్ షాక్‌గా మారింది.

newbeginning #mohanbabu #university #proudmoment | Chanakya G M

ఇక.. ఈ యూనివర్సిటీని మొదట తిరుపతిలో ప్రైవేట్ విశ్వవిద్యాలయంగా ప్రారంభించి.. 2022లో.. శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల నుంచి విశ్వవిద్యాలయంగా డెవలప్ చేశారు. ఇలాంటి క్రమంలో యూనివర్సిటీకి ఫీజుల వివాదంలో ఇలాంటి షాక్ తగలడం.. అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ క్రమంలోనే నెటిజ‌న్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.