ప్రజెంట్ లైఫ్ స్టైల్ లో ఎక్కడ చూసినా విడాకుల వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇక సెలబ్రిటీల విషయంలో అయితే ఇది సుధకామన్ అయిపోయింది. ఎళ్ల తరబడి ప్రేమించి వివాహాలు చేసుకుంటున్నా వారు కూడా విడాకుల పేరుతో క్షణాల్లో దూరమవుతున్నారు. ఈ క్రమంలోనే.. విడాకులు తీసుకోకుండా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న జంటలు సైతం చాలా రేర్ గా ఉన్నాయి. వారిలో రామ్ చరణ్ తేజ్, ఉపాసన జంట కూడా ఒకటి. రామ్ చరణ్ 2012లో ఉపాసన కామినేనిని వివాహం చేసుకున్నారు. అయితే.. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు క్లింకారా అనే పాప జన్మించిన సంగతి తెలిసిందే. కాగా.. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉపాసన యాక్టివ్ గానే ఉంటారు.
తన రొటీన్ వర్క్.. లైఫ్ స్టైల్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను సైతం పంచుకుంటారు. ఈ క్రమంలోనే.. తన మ్యారేజ్ లైఫ్ కి సంబంధించిన రిలేషన్షిప్ మంత్రాన్ని ఆమె పంచుకున్నారు. తన మ్యారీడ్ లైఫ్ ఎంత సక్సెస్ఫుల్గా కొనసాగించడానికి.. తన తల్లి చెప్పిన ఓ టిప్ కారణమట. నా తల్లి నాతో వారంలో ఏదో రాత్రి ప్రేమ రాత్రిగా మారాలని వివరించిందని.. ఏ జంటకైనా ఇది కచ్చితంగా అవసరం అంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. దాని అవసరం మాకు ఇప్పటికే అర్థమైందని చెప్పుకొచ్చింది. మా ఇద్దరి బిజీ లైఫ్ స్టైల్ లో పర్సనల్ స్పేస్ చాలా తక్కువగా ఉండేది.. దాన్ని మేము కచ్చితంగా యుటిలైజ్ చేసుకుంటాం.
మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇతర విషయాల గురించి కాదు.. ఫోన్, టీవీ సైతం పక్కన పెట్టేసి పర్సనల్ విషయాలు మాట్లాడుకుంటాం. మా మధ్య చాలా సమస్యలే వస్తాయి. కానీ.. మేము మాట్లాడుకుని వాటిని పరిష్కరించుకునే ప్రయత్నాలు చేస్తాం. చాలా విషయాలే చర్చించుకుంటాం. ఏ రిలేషన్ లో అయినా కమ్యూనికేషన్ చాలా అవసరం. హ్యాపీగా ఉండాలంటే.. హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయాలంటే కమ్యూనికేషన్ ముఖ్యం. ఇద్దరి కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా.. ఈ కమ్యూనికేషన్ ఎలాంటి ఇబ్బంది లేకుండా రిలేషన్ కంటిన్యూ చేయడానికి పనిచేస్తుంది. అహం, తమ కోరికలను వదులుకొని.. భాగస్వామితో సమయాన్ని కేటాయించుకుంటే కమ్యూనికేషన్స్ సులువు అవుతుంది.. వారి వైవాహిక జీవితం హ్యాపీగా ఉంటుందంటూ ఉపాసన చెప్పుకొచ్చింది. ఉపాసన కామెంట్స్ ప్రెసెంట్ వైరల్ గా మారుతున్నాయి.