నాన్నతో కలిసి పనిచేయడం నరకం.. నాగచైతన్య షాకింగ్ కామెంట్స్..!

అక్కినేని యువ సామ్రాట్.. నాగచైతన్యకు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అయితే.. నాగచైతన్య ఇంటర్వ్యూస్‌లో చాలా రేర్‌గా మాత్రమే మెరుస్తూ ఉంటాడు. సినిమా ప్రమోషన్స్ తప్ప.. బయట ఎక్కువగా కనిపించరు. చాలా రిజర్వ్ గా ఉంటారు. అలాంటి నాగచైతన్య తాజాగా జీ తెలుగు ఛానల్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న.. జయం నిశ్చయమ్మురా టాక్ షోలో సందడి చేస్తాడు. జగపతిబాబు.. హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా ఇద్దరు స్నేహితుల మధ్యన జరిగే కాన్వర్జేషన్లా ఆ షో సాగిపోతూ ఉంటుంది. జగపతిబాబు హోస్టింగ్ అలా ఆకట్టుకుంటుంది. అయినా.. తన మనసుకు బాగా దగ్గరైన వాళ్ళను ఇంటర్వ్యూస్‌కి పిలిచి.. సరదా ముచ్చట్లు పెడతారు.

అక్కినేని ఫ్యామిలీకి బాగా కావలసిన వ్యక్తి కూడా జగపతిబాబు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే.. జగపతిబాబు ఫస్ట్ ఎపిసోడ్ నాగార్జునతో ప్రారంభించాడు. ఇప్పుడు ఆయన తనయుడు నాగచైతన్యను ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ముఖ్యంగా.. తండ్రి నాగార్జునతో కలిసి పనిచేసిన అనుభూతిని పంచుకుంటూ.. నాగచైతన్య చేసిన షాకింగ్ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. నాగచైతన్య, నాగార్జున కాంబినేషన్ లో ఇప్పటివరకు మనం, బంగారు రాజు లాంటి సినిమాలు తెర‌కెక్కాయి. రెండు సినిమాలు కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్నాయి. కానీ.. నాగచైతన్య మాత్రం తన తండ్రితో కలిసి పనిచేయడం నరకమంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఈ విషయాన్ని స్వయంగా జగపతిబాబుతో ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. నాన్నకు ఏది ఒక పట్టాన‌ నచ్చదు.. మా ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కనుక ఎక్కడా కూడా నా క్యారెక్టర్ లో కొంచెం కూడా లోపం ఉండకూడదని చూసేవాడు. అందుకోసం ఎన్నో టేకులు , కథలో మార్కులు , చేర్పులు.. ఇలా చాలా జరిగేవి. ఈ ప్రక్రియ నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఇక.. ఎస్పెషల్లీ మనం సినిమాకి అయితే.. నాన్న స్పెషల్ కేర్ తీసుకున్నాడు. అంత కఠినంగా ఆయన సినిమా షూట్ కంప్లీట్ అయ్యేవరకు అవుట్ ఫుట్ గురించి తగ్గకుండా చూడడం.. గతంలో అసలు నేనెప్పుడూ చూడలేదు అంటూ వివరించాడు నాగచైతన్య. ఈ క్రమంలోనే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత లైఫ్‌కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను సైతం షేర్ చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే.. ఏం ఇంటర్వ్యూ అక్కినేని ఫ్యాన్స్ కు విజువల్ ఫెస్ట్ ల ఉందనడంలో సందేహం లేదు.