తాజాగా ఓజీతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ సుజిత్.. తన నెక్స్ట్ సినిమాను నాచురల్ స్టార్ నానితో ఫిక్స్ చేసుకున్నాడు. ఈ క్రమంలో సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ ఫిక్ప్ చేశారట మేకర్స్. ఓజి మూవీ బ్యానర్ అయిన డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై.. డివివి దానయ్యనే ఈ సినిమాకు కూడా ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను దసరా పర్వదినాన్ని పురస్కరించుకుంటూ అక్టోబర్ 2న గ్రాండ్గా లాంచ్ చేయనున్నారట. యురప్ బ్యాక్ డ్రాప్లో డార్క్ హ్యూమర్ యాక్షన్ ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మలయాళీ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలు మెరవనున్నారని టాక్. ప్రస్తుతం నాని.. ది ప్యారడైజ్ సినిమా షూట్‌లో బిజీ బిజీగా గడుపుతున్నాడు.
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో పిరియాడికల్ డ్రామాగా రూపొందునున్న ఈ సినిమాను శ్రీకాంత్ ఓద్దెల దర్శకుడుగా వ్యవహరించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత.. బ్లడీ రొమియో సెట్స్ లోకి నాని ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. ఇక నాని ప్రజంట్ పాన్ ఇండియా లెవెల్‌లో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్ల కాంబో మూవీపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి.