టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడుగా కింగ్ నాగార్జునకు తిరుగులేని క్రేజ్ ఏర్పడింది. ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోస్ ఉన్నా.. చాలా రొమాంటిక్ సినిమాల్లో నటించినా కేవలం నాగార్జునకు మాత్రమే ఆ ట్యాగ్ సొంతమైంది. దానికి తగ్గట్టుగానే నాగార్జున తన లుక్ తో ఈ ఏజ్ లోను విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నాడు. అయితే.. తాజాగా నాగార్జునకు మించిన మన్మధుడు నాగచైతన్య అని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. తనకు సంబంధించిన చాలా సీక్రెట్స్‌ను రివిల్ చేశాడు. అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా నాగచైతన్య.. జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోలో సందడి చేశాడు.
ఇందులో చైతు, జగపతిబాబు మధ్య ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్.. అందులో భాగంగానే ఓ నెంబర్ సీక్రెట్ ను జగపతిబాబు రివీల్ చేయడం.. చైతు టెన్షన్ పడ్డాడటం హైలెట్. ఏం చేయకుండానే అమ్మాయిలు నీ వెంట పడతారని జగపతి బాబు.. కామెంట్స్ చేశారు. మీ నాన్న బయటపడతాడు.. నువ్వు బయటపడవ్ అంటూ.. చైతూలో ఉన్న సీక్రెట్ యాంగిల్ ను జగపతిబాబు రివీల్ చేశాడు. ఆ విశేషాలు మరింత డీటెయిల్ గా తెలియాలంటే జీ తెలుగులో స్ట్రిమింగ్ అయ్యే జయము నిశ్చయంబురా షోను చూడాల్సిందే. ఇప్పటికే ఇందులో ఎంతో మంది టాప్ సెలబ్రిటీస్ సందడి చేశారు. మొదట నాగార్జున గెస్ట్ గా పాల్గొని సందడి చేయగా.. తర్వాత నాని, సందీప్ రెడ్డి వంగ, ఆర్జీవి, మీనా, ప్రభుదేవా లాంటి స్టార్ సెలబ్రెటీస్ పాల్గొన్నారు.
లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారుతుంది. నాగచైతన్య ఎంట్రీ ఇవ్వడం.. జగ్గు బై ఏదో పదం అనగానే.. చైతు నవ్వడం ప్రోమోకో హైలెట్‌గా మారింది. హైదరాబాదులో హిపో క్లాస్ అక్కడ మాస్ అని జగపతిబాబు అనగానే నిజానికి స్కూల్లో చాక్లెట్ బాయ్నే అంటూ చైతు చెప్పుకొచ్చాడు. రానా చెడగొట్టడానికి జగపతిబాబు అడగడంతో అయామయంలో పడ్డ చైతు పాపం అలా అనకండి అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో షోలో నవ్వులు పూసాయి. ఇక కాప్వర్జేషన్లో తర్వాత.. 5 9 12 19 అనే నెంబర్ జగపతిబాబు చెబుతూ.. ఇది వింటే ఏమైనా గుర్తొస్తుందా అని చైతని అడిగాడు. దానికి కాస్త అయామయంలో ఆలోచనలు పడ్డ చైతు.. కాసేపు ఆగి.. ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఇప్పుడే చెప్పేసేయండి అన్నాడు. తర్వాత అమ్మాయి నెంబరా అని చైతు అనడంతో.. మిస్ అయ్యావా అని జగపతిబాబు క్వషన్ చేశాడు.
ఏమి మిస్ అవ్వలేదని చైతు అనడంతో ఆ నెంబర్ వెనకాల ఎవరో అమ్మాయి స్టోరీ ఉందని క్లారిటీ వచ్చేసింది. తర్వాత నువ్వేమీ అటెంప్ట్ చేయకుండానే.. ఆడవాళ్ళు నీకోసం పడి పడి దొర్లుతున్నారంటూ జగపతిబాబు కామెంట్స్ చేశారు. అదేంటో అంటూ చైతు ఆశర్యాన్ని వ్యక్తం చేస్తాడు. తర్వాత మీ నాన్న అయినా బయటపడతాడు కానీ.. నువ్వు అసలు దొరకవు అంటూ జగపతిబాబు అన్నాడు. ఇక నాగచైతన్య మాట్లాడుతూ దొరకడం ఏంటి బాబు గారు ఏదైనా చేసి ఉంటే దొరుకుతాం.. ఏం చేయకుండా ఎలా దొరుకుతామని చెప్పడం.. అబ్బా ఓయ్ ఓయ్ అంటూ జగపతిబాబు ఇతర ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ హైలైట్ గా మారాయి. మొత్తంగా చేతుల్లో బయటకు తెలియని ఓ మన్మధుడు ఉన్నాడు అంటూ జగపతిబాబు ఈ షోలో రివీల్ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు చైతూ లైఫ్‌లో ఉన్న ఎన్నో సీక్రెట్స్ షేర్ చేసుకున్నాడు.