టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ విషయంలో నేనొకటి చెప్తే.. అందరూ మరోలా అర్థం చేసుకున్నారంటూ.. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. గేమ్ ఛేంజర్.. సాంగ్స్‌కు హుక్ స్టెప్స్ లేవని థమన్ ఆ సినిమా రిలీజ్ టైం లో అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇది నెటింట హట్ టాపిక్‌గా ట్రెండ్ అయింది. తాజాగా దీనిపై థమన్ స్పందించారు. కథలెనో చెప్పారు.. కవితల్ని రాశారు.. పాట కోర్ట్ సినిమాకి కీలకం. ఆ సాంగ్‌లో హుక్ స్టెప్స్ అందరిని ఆకట్టుకున్నాయి. అది సినిమాకు కూడా ప్లస్ అయింది.
అలాగే.. అల వైకుంఠపురం మూవీలో బుట్టబొమ్మ స్టెప్స్ కూడా తెగ ట్రెండింగ్‌గా మారి.. ఇంపాక్ట్ కనిపించింది. మహేష్ బాబు సింపుల్ స్టెప్స్ వేయడంతో సర్కార్ వారి పాటల్లో కళావతి క్రేజ్ పెరిగింది. హుక్ స్టెప్స్ రీల్స్ కు బాగా సహకరించాయి. చరణ్ పెద్ద డ్యాన్సర్.. తొలి సినిమా నాయక్ నుంచి లైలా ఓ లైలా, బ్రూస్లీ, మెగా మెగా మీటర్ లాంటి ఎన్నో సాంగ్స్ కు అద్భుతమైన డాన్స్ స్టెప్స్ తో అదరగొట్టాడు. అలాంటి ఆయనకు గేమ్ ఛేంజెర్ విషయంలో కొరియోగ్రాఫర్ సరైన మూమెంట్స్ ఇవ్వలేకపోయారని.. నేను ఇటీవల షేర్ చేస్తుకున్న.
హీరోని టార్గెట్ చేసి నేను మాట్లాడుతున్నానని.. మీరందరూ అపార్థం చేసుకున్నారు. గేమ్ ఛేంజర్ విషయంలో చరణ్ డ్యాన్స్ టాలెంట్ సరిగ్గా వాడలేకపోయారు అన్నది నా బాధ. అంతేకానీ.. నేను ఎవరిని తప్పు పట్టలేదు అంటూ వివరించారు. చరణ్.. చాలా గొప్ప హార్ట్ ఉన్న వ్యక్తి. అందుకే ఆయనను నేను.. మెగా హార్ట్ స్టార్ అని పిలుస్తుంటా అంటూ వివరించాడు. ఇక ఓజీ మ్యూజిక్ గురించి చరణ్ తనతో ప్రత్యేకంగా మాట్లాడారని.. తమను గుర్తుచేసుకున్నాడు. మ్యూజిక్ ఫైర్ మోడ్ అన్నారని.. థమన్ చేతులపై కిరోసిన్ పోసుకొని సంగీతం అందించావా అన్ని చరణ్ నన్ను అడిగాడు అంటూ చెప్పుకొచ్చాడు. మేమిద్దరం ఎప్పుడు చాలా ఫ్రెండ్లీ గానే ఉంటామని.. ఉద్దేశపూర్వకంగానే కావాలని కొంతమంది నెగటివ్ ప్రచారాన్ని క్రియేట్ చేశారంటూ వివరించాడు. ప్రస్తుతం థమన్ చేసినా వ్యాక్యలు వైరల్ గా మారుతున్నాయి.