‘ దేవర 2 ‘ కంటే ముందే మరో స్టార్ హీరోతో కొరటాల మూవీ.. బొమ్మ దద్దరిల్లిపోద్ది..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాలు శివకు ఆడియన్స్‌లో ప్ర‌త్యేక‌ పరిచాయాలు అవసరం లేదు. ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఎన్టీఆర్‌తో దేవర సినిమాను తెర‌కెక్కించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. కథపై పలు విమర్శలు ఎదురైనా.. ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్.. సినిమా సక్సెస్ కు తోడైంది. ఈ క్రమంలోనే కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇంట్రెస్టింగ్ వార్తలు ఫిలిం సర్కిల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గతంలో.. నాగచైతన్యతో కొరటాల సినిమా చేయబోతున్నాడని.. దేవర 2 కంటే ముందే.. ఈ సినిమా రిలీజ్ అయిపోతుంది అంటూ వార్తలు వైర‌ల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. అవన్నీ కేవలం రూమర్స్ అని తేలిపోయింది. ఇలాంటి క్రమంలో కొరటాల శివ ఓ సైన్సేషనల్ స్టార్ హీరోతో సినిమా చేయడానికి సిద్ధమయ్యిడంటూ టాక్ వైరల్ అవుతుంది.

Devara 2' CONFIRMED on 1st anniversary: Jr NTR to return - Check out the  announcement here | Telugu Movie News - The Times of Indiaఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. నందమూరి నట‌సింహం బాలయ్యతో.. కొరటాల శివ ఈ సినిమా విషయంలో చర్చలు జరుపుతున్నాడట‌. అనీ.. అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్టు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. ఇలాంటి క్రమంలో కొరటాల టార్గెట్ దేవర 2 ను కంప్లీట్ చేయాల్సి ఉంది. కానీ.. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌ సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా, అలాగే నెల్సన్ దిలీప్ సినిమాలు లైన్లో ఉన్నాయి. దీంతో.. దేవర 2 షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. ఈ గ్యాప్ లోనే కొరటాల శివ.. బాలయ్యతో సినిమా తీసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. అదే.. బాలయ్యతో కలిసి ఓ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించినట్లు సమాచారం.

Koratala Shiva to team with Balakrishna | cinejosh.comప్రస్తుతం ఈ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారడంతో.. మాస్ ఫ్యాన్స్‌లో పండగ వాతావరణం మొదలైంది. యాక్షన్ సీన్స్ ఎలివేట్ చేయడంలో కొరటాల దిట్ట. ఇక బాలయ్యకు ఉన్న మాస్ క్రేజ్‌.. ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే వీళ కాంబో ఆడియన్స్‌లో ఆసక్తి మొదలయింది. నిజంగా వీళ్ళిద్దరి కాంబోలో సినిమా ఉంటుందా.. లేదా.. అని టాక్ తెగ ట్రెండింగ్ గా మారింది. ఒకవేళ ఈ సినిమా నిజంగానే తెర‌కెక్కి రిలీజ్ అయితే మాత్రం.. బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.