నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ స్వింగ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న బాలయ్య.. ఇప్పుడు మరోసారి బ్లాక్ బస్టర్ అఖండ సీక్వెల్‌గా.. అఖండ 2 తాండవంలో నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీ మొదటి నుంచి మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. ఇక సెప్టెంబర్‌లో ఈ మూవీ రిలీజ్ కావలసి ఉండగా.. కొన్ని కారణాలతో వాయిదా పడింది.
డిసెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే.. గోపీచంద్ మల్లినేని డైరెక్షన్‌లో బాలయ్య మరో సినిమాలో నటించనున్నాడని అఫీషియల్ గా వెల్లడించారు. వీరసింహారెడ్డి సక్సస్ తర్వాత మరోసారి వీళ్ళ కాంబోపై మంచి హైప్ మొదలైంది. ఇక ఇప్పటికే సినిమా స్క్రిప్ట్‌ను కంప్లీట్ చేసిన గోపీచంద్.. సెకండ్ హాఫ్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు.. ఎమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో డిజైన్ చేశాడని.. సెకండ్ హాఫ్ లో బాలయ్య క్యారెక్టర్ కు బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట.
ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య మాఫీయా డాన్‌గా కనిపించనున్నాడని.. సరికొత్త షేడ్స్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటారని తెలుస్తుంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూసర్ గా ఈ మూవీ రూపొందనుంది. ఇక తాజాగా గోపీచంద్ సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈసారి గర్జన మరింత గట్టిగా ఉండబోతుందంటూ వివరించాడు. బాలయ్యతో మళ్ళీ పని చేయడం చాలా గౌరవంగా.. హ్యాపీగా ఫీల్ అవుతున్నా.. ఈ సినిమా కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందంటూ సినిమాపై ఆడియన్స్ లో హైప్ డబల్ చేశాడు. ఇక మూవీ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.