టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మరో నాలుగు రోజుల్లో గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిటీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే నిన్న సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ నగర్ ఓపెన్ స్టేడియం లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే.. మొదటి నుంచి పవన్ ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూమెంట్ ఓజీ ట్రైలర్. ఇది అఫీషియల్ గా రిలీజ్ చేస్తే మాత్రం ఫ్యాన్స్‌లో హైప్ డబల్ అయిపోతుంది అనడంలో సందేహం లేదు. ప్రేక్షకులకు పూనకాల మోత మోగిపోతుందనడంలో సందేహమే లేదు. అయితే.. సినిమా ట్రైలర్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేయకున్నా.. నిన్న జరిగిన ఈవెంట్‌లో ఫ్యాన్స్ కోసం సవన్ ప్లే చేయించాడు.
నిజానికి అక్కడ ట్రైలర్ రిలీజ్ చేయాలని ఎవరు భావించలేదు. డిఐ చేయాలి.. స్పెషల్ ఎఫెక్ట్స్ పెండింగ్ ఉన్నాయని డైరెక్టర్ సుజిత్ ఎంత చెప్పినా.. పవన్ కళ్యాణ్ మాత్రం పట్టుబట్టి మరీ ట్రైలర్ వేయించాడు. ఇక ఈ కాన్సెర్ట్‌లో ప్లే చేసిన ట్రైలర్ కొంతమంది ఫ్యాన్స్ ఫోన్లో రికార్డ్ చేసి లీక్ చేశారు. ఇక ఈ వీడియో చూస్తే ఆడియన్స్‌కు పూనకాలు కాయం. ఓమి రోల్‌లో విలన్ గా ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ లుక్ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. తర్వాత పవన్ రోల్‌కు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఇచ్చిన ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్. అందరినీ ఎదుర్కోవాలంటే ఒకడు ఉండాలంటూ చెప్పిన ఓజాస్ గంభీర్ రోల్ ఇంట్రడక్షన్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ ప్రియాంక అరుణ్ మోహన్ సహ మిగతా పాత్రలను కూడా ట్రైలర్ కట్‌లో చూపించారు.
శ్రీయ రెడ్డి స్మైల్ అయితే బాబోయ్ అరాచకం అనే చెప్పాలి. ఓజీ ట్రైలర్ అంతా ఒక ఎతైతే.. పవన్ ఎంట్రీ, ఆయన డైలాగ్స్, ఫైనల్ షార్ట్, ఇక లాస్ట్ లో బొంబాయి వస్తున్న అని పవన్ చెప్పే డైలాగ్.. ఓజాస్ గంభీర్ అంటూ పవన్ అనగానే ఫ్యాన్స్‌లో వచ్చే కిక్.. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఇక ఈ ట్రైలర్ షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనడంలో సందేహం లేదు. ఇప్పటికే నార్త్ అమెరికాలో ఓ జి రెండు మిలియన్ డాలర్ల గ్రహాలు కొల్లగొట్టి రికార్డ్ సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో పూర్తి లెవెల్ బుకింగ్స్ ఓపెన్ కాకుండా రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చేసాయి. ఆల్మోస్ట్ రూ.30 కోట్ల కలెక్షన్లు ఇప్పటికే రాబట్టిన ఓజీ ట్రైలర్ రిలీజ్ అయితే మాత్రం డబుల్ బుకింగ్స్ ను నమోదు చేసుకుంటుందంటూ ట్రేడ్ వర్గం చెబుతున్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 24న పేయిడ్ ప్రీవియస్తో ఆడియన్స్ను పలకరించనుంది వీటి నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే చాలు పవర్ స్టార్ తుఫాన్ మొదలైపోతుంది.
OG FULL Trailer Leaked 💥💥#OGconcert #OGTrailer #TheyCallHimOG pic.twitter.com/AKYICoso3v
— Nayan Rana (@nayanRana83) September 21, 2025