మహాభారతం ప్రాజెక్ట్ పై అమీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. అది మూవీ కాదు.. ఓ యజ్ఞం అంటూ..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌కు తెలుగు ఆడియ‌న్స్‌లోను ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తాజాగా అమీర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో సందడి చేశాడు. ఇందులో భాగంగా ఆయన మహాభారతం ప్రాజెక్ట్ పై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి. ఈ ఇతిహాసానికి జీవం పోయాలని నేను దాదాపు 30 ఏళ్లుగా కష్టపడుతున్నానని.. ఇది నా లైఫ్ లోనే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే మూవీ పనులు ప్రారంభించేసామని.. మరో రెండు నెలల్లో స్క్రిప్ట్ పనులు మొదలెడతామంటూ చెప్పుకొచ్చాడు.

Aamir Khan's new dream project – the Mahabharata | Filmfare.com

దీనికి ఒక సినిమాగా కాదు.. యజ్ఞంలా పూర్తి చేయాలనుకుంటున్నా అంటూ అమీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. సినిమా కోసం 30 సంవత్సరాలుగా ప్రణాళికలు వేశానని.. ఇది నా లైఫ్ లోనే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్.. దీనికి ఎంత సమయం పట్టినా పర్లేదు.. మీ అందరూ మెచ్చుకునేలా ప్రాజెక్టును రూపొందించాలి అనుకుంటున్నాను. దానికోసం.. అంతా సిద్ధంగా ఉండండి అంటూ అమీర్ ఖాన్ కామెంట్స్ చేశాడు. గతంలో కూడా ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు.

Mahabharat': Aamir Khan gives a major update about passion project; says  'It's not a film; it is a yagna' | - The Times of India

ఇక మహాభారతాన్ని ఒకే భాగంలో చూపించలేమ‌ని.. అందుకే సిరీస్ లుగా అందించాలని ఫిక్స్ అయ్యానంటూ చెప్పుకొచ్చాడు. భారీ లెవెల్ లో ఈ ప్రాజెక్టు రూపొందించనున్నామని.. ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు దీనికోసం పనిచేయనున్నారని.. స్టోరీ రాయడం కంప్లీట్ అయిన తర్వాత కాస్టింగ్ సెలక్షన్ జరుగుతుందని వివరించాడు. ఇక అమీర్ ఖాన్ కామెంట్స్ నెటింట‌ వైరల్‌గా మారడంతో మహాభారతం ప్రాజెక్టుపై ఆడియన్స్ లో మంచి హైప్‌ మొదలైంది.