ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం. ఎప్పుడు ఎవరిలైఫ్ ఎలా ఉంటుందో.. ఎవరు చెప్పలేరు. ఇక ఇండస్ట్రీలో ఎక్కువగా కనిపించే మరో కామన్ విషయం రూమర్స్. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్ హీరోస్ నుంచి.. చిన్నచిన్న నటీనటుల వరకు అందరు విషయంలో ఏదో ఒక టాక్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతుంది. అలా.. తాజాగా టాలీవుడ్లో ఓ స్టార్ హీరో, అతని భార్యలకు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. ఇంతకి ఆ జంట ఎవరో కాదు.. శర్వానంద్ అతని భార్య రక్షిత. ఎస్.. వీళ్ళిద్దరి మధ్య గత కొంతకాలంగా భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయని.. ప్రస్తుతం ఈ జంట వేరువేరుగా ఉంటున్నారని టాక్.
గత కొద్ది సంవత్సరాల క్రితం గ్రాండ్ లెవెల్లో వివాహం చేసుకున్న ఈ జంట పాపకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు చక్కని పేరు కూడా పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలో వీళ్లకు సంబంధించిన భేదాభిప్రాయాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిలో ఎంత వరకు వాస్తవ తెలియదు కానీ.. ప్రస్తుతం అయితే వీళ్ళు సపరేట్ సపరేట్ గానే ఉంటున్నారనది మాత్రం వాస్తవమట. అయితే.. ఈ జంట విడాకుల కోసం మాత్రం ఆలోచన చేయడం లేదట. పరస్పర అవగాహనతో ఇద్దరు ఒకరికి ఒకరు మాట్లాడుకుని.. కొన్నాళ్లపాటు వేర్వేరుగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. రెండు కుటుంబాల పెద్దలు విళ్లను కలిపే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే.. మీరు కుటుంబాల్లో ఎవరు పట్టు విడవలేరు. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి ఈ జంట ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉంటున్నారు. పాప మాత్రం అమ్మ, నాన్న ఇద్దరి దగ్గర ఉంటుందట. ఇక సెలబ్రిటీలకు సంబంధించిన ఇలాంటి నుకార్లు రావడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ.. ఇటీవల కాలంలో పెళ్లిళ్లు సరిగ్గా నిలవడం లేదు. ఇక ఇండస్ట్రీలో అయితే చాలా మంది సెలబ్రిటీలు వివాహం చేసుకుని కొద్ది సంవత్సరాలకు ఏవో కారణాలతో విడాకులు తీసుకుని ఓడిపోతున్నారు. ఇలాంటి క్రమంలో శర్వానంద్ జంటపై వస్తున్న వార్తలు విషయంలో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. అసలు వీళ్ళిద్దరి మధ్యన వివాదం ఏమై ఉంటుంది.. అసలు ఎందుకు ఇలా దూరం దూరంగా ఉంటున్నారనే చర్చ హాట్ టాపిక్‌గా మారింది.