కల్కి 2: దీపికనూ రీ ప్లేసే చేసే సత్తా ఉన్న హీరోయిన్స్ వాళ్ళిద్దరేనా..?

గతేడాది వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ కల్కి 2898 ఏడి. హిస్టారికల్ సైన్స్ ఫ్రిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో.. అమితాబచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పఠాని, శోభన, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలకపాత్రలో మెరుశారు. ఇక రాజమౌళి, ఆర్జీవి, విజయ్ దేవరకొండ, అనుదీప్, ఫ‌రీయా అబ్దులా, మృణాల్‌ ఠాగూర్, విజయ్ దేవరకొండ, మాళవిక తదితరులు కామియో రోల్స్‌లో మెరిసారు.ఇలా భారీ కాస్టింగ్ తో బడ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ను అందుకుంది.

Anushka Shetty Birthday: A look at the 'Baahubali' actress' net worth -  CNBC TV18Anushka Shetty Birthday: A look at the 'Baahubali' actress' net worth -  CNBC TV18

భవిష్యత్తు ఎలా ఉంటుందో.. కలియుగాంతం, కృష్ణుడు జన్మించడం లాంటి పురాణాలను బేస్ చేసుకుని క్రియేటివ్ గా తెర‌కెక్కించిన ఈ సినిమాకు ప్రధాన సూత్రధారిగా సుమతి పాత్రలో దీపికా పదుకొనేను చూపించారు. ఇక మొదటి భాగంలో దీపిక ప్రెగ్నెంట్ గా మెరిసిన సంగతి తెలిసిందే. ఆమె కడుపులో కల్కి జన్మిస్తాడని.. ఆయనే ప్రపంచాన్ని కాపాడతాడని కాన్సెప్ట్ ఈ సినిమాలో చూపించారు. ఇక ఫస్ట్ పార్ట్ లో దీపిక ప్రెగ్నెంట్ గానే ఉంది. సెకండ్ పార్ట్ లో ఆమె కల్కికి జన్మనివ్వబోతుంది అనే క్లారిటీని మేకర్స్ పార్ట్ 1లో చూపించారు. ఇలాంటి క్రమంలో వైజయంతి మూవీస్ బ్యానర్ వాళ్ళు దీపిక పదుకొనేను పార్ట్ 2 నుంచి తప్పించినట్లు అఫీషియల్ గా వెల్లడించారు. ఈ క్రమంలోనే దీపిక ప్లేస్ లో కల్కి 2 లో ఎవరు నటించబోతున్నారని ఆసక్తి మొదలైంది. అంతేకాదు.. ఆమె ప్లేస్ లో ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు హీరోయిన్‌లు మాత్రమే సరిపోతారంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Priyanka Chopra - Simple English Wikipedia, the free encyclopedia

ఇంతకీ ఆ హీరోయిన్ల‌లో ఒక‌రు టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. మరొకరు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. వీళ్ళిద్దరి మాత్రమే ఇప్పుడు దీపికా వదిలేసిన పాత్రకు పర్ఫెక్ట్ గా సెట్ అవుతారని చెప్తున్నారు. ఇప్పటికే బాహుబలి 1, బాహుబలి 2లో అనుష్క – ప్రభాస్ కాంబోను ఆడియన్స్ ఆదరించారు. ఈ క్రమంలోనే మళ్లీ కల్కి 2లో అనుష్క, ప్రభాస్ కలిసి మెరిస్తే ఖచ్చితంగా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక దీపిక ప్లేస్ లో మరో బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని దీపిక పర్సనాలిటీ, అందం, టాలెంట్ ను రీప్లేస్ చేయగల మరో బ్యూటీ ప్రియాంక చోప్రా. ఆమెకు ఆ సత్తా ఉందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి మూవీ యూనిట్ దీపిక ప్లేస్ లో ఏ హీరోయిన్ ను తీసుకుంటారోన్నారా తెలియాల్సి ఉంది.