టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. సుజిత్ డైరెక్షన్‌లో రూపాందుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ క్రేజీ ప్రాజెక్ట్ ఓజీ. గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతుంది. ఇక ఇప్పటికే సినిమాపై పవన్ అభిమానులతో పాటు.. పాన్ ఇండియన్ ఆడియన్స్‌లోను మంచి హైప్ మొదలైంది. ఈ క్రమంలోనే తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు టీం. ఇక సినిమాకు యూ\ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తుంది. కొన్ని కట్స్ కూడా సినిమాపై విధించారట. సినిమాల్లో హింసాత్మక సీన్స్ చాలా ఉండడంతో.. వాటిని ఇలాగే ఉంచితే ఏ సర్టిఫికెట్ వస్తుందని సెన్సార్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే అలాంటి యాక్షన్ సీన్స్ తీసేసి.. యు\ఏ సర్టిఫికెట్ దక్కించుకున్నారు.
కారణం యూ\ఏ సర్టిఫికెట్ వస్తే సినిమాను అన్ని వర్గాల ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయవచ్చు అని టీం భావించారట. ఈ క్రమంలోనే చాలా వరకు హింసాత్మకంగా ఉన్న యాక్షన్ సీన్స్ తీసేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా కూడా చాలా తక్కువ రన్ టైంతో రిలీజ్ కానున్నట్లు సమాచారం. కేవలం 2 గంటల 30 నడివితో సినిమా ఆడియన్స్‌ను పలకరించనుందట. అంతేకాదు.. సినిమా సెన్సార్ టాక్ కూడా ప్రెజెంట్ తెగ వైరల్‌గా మారుతుంది. సినిమాని ఇప్పటికే వీక్షించిన సెన్సార్ సభ్యులు.. ఫస్ట్ హఫ్ మొత్తం చాలా డీసెంట్ గా ఉందని.. ప్రీ ఇంటర్వెల్ నుంచి.. ఇంటర్వెల్ వరకు ఆడియన్స్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్‌లు రానున్నయని తెలుస్తోంది.
సెకండ్ హాఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని.. అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్‌కు ఆ రేంజ్ హిట్ ఓజీతో వస్తుందని.. బెస్ట్ మూవీ అని పేర్కొన్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్‌కి వచ్చే ఎలివేషన్స్ ఫ్యాన్స్‌కు పిచ్చెక్కిస్తాయని.. సినిమాలోను మొత్తం ఐదు సన్నివేశాలు ఆడియన్స్‌లో ఉండే ఐదు యాక్షన్ సీన్స్ ఆడియన్స్‌లో గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని.. మైండ్ బ్లోయింగ్ లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనుందంటూ చెబుతున్నారు. ఇదే టాక్ నిజమైతే కచ్చితంగా ప్రస్తుతం ఉన్న హైప్‌తో సినిమా రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేయడం ఖాయమని.. పవర్ స్టార్ ఊచకోత మొదలవుతుందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా రిలీజై.. ఫస్ట్ డే, ఫస్ట్ షో తో.. ఆడియన్స్ నుంచి ఎలాంటి టాక్ అందుకుంటుందో చూడాలి.