మహిళా నాయకత్వంపై సమంత సెన్సేషనల్ కామెంట్స్..!

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం బాషతో సంబందం లేకుండా అన్ని ఇండస్ట్రీలోను సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ.. ఆడపా దడపా వెబ్ సిరీస్లలో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం రక్త బ్రహ్మండ్ ది బ్ల‌డీ కింగ్డమ్ సిరీస్‌తో బిజీబిజీగా గడుపుతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. గతంలోలా ఎక్కువ ప్రాజెక్టులు చేయన‌ని.. కానీ చేసే అతి తక్కువ ప్రాజెక్టులలో ఆయన మంచి నాణ్యత.. కచ్చితంగా నేను చేసే పాత్రలు ఆడియన్స్ మెప్పించేలా చూసుకుంటా అంటూ వెల్లడించింది. ఇక సోషల్ మీడియా గురించి మాట్లాడుతూ.. నా లైఫ్ ని ప్ర‌భావితం చేసే మార్గదర్శకాలను కనుగొనడంలో నాకు సోషల్ మీడియా సహాయం చేసింది. అందుకే.. ఇది అందరూ అనుకున్నట్లు ఎక్కువ హాని కలిగిస్తుందని నేను భావించనంటూ చెప్పుకొచ్చింది.

చాలా వరకు సోషల్ మీడియాలో వాస్తవంగా ఉండడానికి చూస్తా. ఎక్కువగా ఇటీవల కాలంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను అందరితో షేర్ చేసుకుంటున్నా. ఇది మంచి పనే అని నేను భావిస్తున్నా. సోషల్ మీడియాలో వచ్చే ప్రసంస‌లను ఎలాగైతే తీసుకుంటామో.. ట్రోలింగ్, నెగిటివ్ కామెంట్లను కూడా స్వీకరించగలగాలి.. మనం దాని కంట్రోల్ చేయాలి కానీ.. అది మన లైఫ్ ని కంట్రోల్ చేయకూడదంటూ వివరించింది. ఇక గతంలో కేవలం కీర్తి, స్టార్డం, గుర్తింపు ఉంటే చాలని ఇవే మన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తాయని అనుకున్నా. కానీ.. ఇది శాశ్వతం కాదు. స్టార్ గా కొనసాగుతున్నప్పుడు కొందరిలో అయినా స్ఫూర్తి నింపాలని.. నలుగురిపై ప్రభావం చూపించేలా సొంతంగా ఏదైనా చేయాలని భావిస్తున్న. ఇక ఫ్యాషన్, ఇమేజ్ గురించి రాదు.. నా మనసుకు దగ్గరగా ఉన్న కథలను మాత్రమే తీసుకుంటున్న. నాకు సినిమాలు ఆరోగ్యంపై ఆసక్తిగా ఉంది.

ప్రస్తుతం నేను వాటిపైన దృష్టి పెట్టా. మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్న. అందుకే శరీరం చెప్పేది వినాలని ఫిక్స్ అయ్యా. పని తగ్గించుకున్న తక్కువ ప్రాజెక్టు లే చేసిన.. ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యే సినిమాలనే ఎంచుకుంటా అంటూ వివరించింది. అమ్మాయిల అందరికీ నేను చెప్పేది ఒకటే. భయంతో ఏ పని ప్రారంభించొద్దు.. మీ బలమేంటో తెలుసుకోవడానికి మీరేం చేయనవసరం లేదు. మీపై పూర్తి నమ్మకంతో.. భవిష్యత్తు వైపుకు ముందడుగు వేయండి అంటూ వివరించింది. ఇక నేను ఎప్పుడు ఇండస్ట్రీలో నిత్య విద్యార్థినే అన్ని.. భాషతో సంబంధం లేకుండా ఓటీటీలోను వివిధ‌ కథలను ఎంచుకోవడానికి కూడా అదే కారణం అంటూ వివరించింది.

నా వృత్తిలో మునుపటి కంటే మెరుగ్గా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటా.. భవిష్యత్తులో సవాళ్లతో కూడిన పాత్రలు చేయడానికి నేను ఆసక్తి చూపుతున్న.. ఇలాంటి ప్రాజెక్టులని సాధించడం కష్టమే కానీ నా లక్ష్యం మాత్రం అదే అంటూ వివరించింది. ఇక మహిళా నాయకత్వంపై ఆమె మాట్లాడుతూ.. కొందరిలో అయినా స్ఫూర్తిని నింపగలగాలి నలుగురిపై ప్రభావం చూపాలని.. ఎవరికి వాళ్లు సొంతంగా ఫిక్స్ అవ్వాలి.. ఏ విషయంలో అయినా ధైర్యంగా ముందడుగు తీసుకునే ఆడవాళ్లే సక్సెస్ సాధిస్తారంటూ చెప్పుకొచ్చింది. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను దూరదృష్టి ఉన్న ప్రతి మహిళ నలుగురిలోకి వచ్చి తన ఆలోచనలను అందరితో పంచుకోవాలి.. ప్రస్తుతం ప్రపంచమంతా అలాంటి మహిళా నాయకత్వమే కోరుకుంటుందంటూ వివ‌రించింది. ఈ కామెంట్స్ తెగ వైరల్‌గా మారుతున్నాయి.