ఎన్టీఆర్ అక్కగా నాగార్జున లక్కీ బ్యూటీ.. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ అదుర్స్..!

టాలీవుడ్‌ మాటలమంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ఆడియన్స్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఎంచుకునే కథ విషయంలో పర్ఫెక్షన్ మాత్ర‌మే కాదు.. మూవీ లోని ప్రతి డైలాగ్ కూడా సినిమా చూసే ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా చాలా పక్కగా డిజైన్ చేస్తూ ఉంటాడు. ఇక త్రివిక్రమ్ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. కచ్చితంగా క్లాస్, మాస్ మిక్స్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోతారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాల్లో నటించేందుకు హీరో, హీరోయిన్లు సైతం ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. సినిమాలో ప్రతి పాత్రను డిజైన్ చేసే విధానం.. కథ నిర్మాణం చాలా స్పెషల్ గా ఉంటాయని నమ్మకం సెలబ్రిటీస్ లోను ఉంటుంది.

Jr NTR to begin shoot for Trivikram in April

ఈ క్రమంలోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలంటే ఫ్యాన్స్ తో పాటు.. ఇండస్ట్రీ కూడా ఆసక్తి చూపుతుంది. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్.. వెంకటేష్ తో బ‌డా సినిమాను ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన చాలా డిఫరెంట్ యాంగిల్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకున్నాడు. ఇక సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా తుది దశ‌కు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్టును ఎన్టీఆర్ తో సెట్స్‌పైకి తీసుకురానున్నారని టాక్. ఇక‌ ఎప్పటినుంచో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో ప్రాజెక్ట్ రానుందంటు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబో సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈసారి త్రివిక్రమ్ ఓ సరికొత్త కథతో.. కొత్తదనం కలిగిన ప్రజెంటేషన్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడని నమ్మకం ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.

Manmadhudu Heroine Anshu sagar: హీరోయిన్‌ అన్షు సాగర్‌ ఇంటర్వ్యూ

ఇక సినిమాలో హీరోగా ఎన్టీఆర్ ఎంత పవర్ఫుల్ రోల్ లో కనిపించనున్నాడో.. అదే రేంజ్ లో సపోర్టింగ్ రోల్స్ కూడా ఒక డెప్త్ ఉండేలా త్రివిక్రమ్ డిజైన్ చేస్తున్నడట. అందులో ముఖ్యంగా ఎన్టీఆర్ అక్క రోల్ సినిమాకు మరింత హైలెట్ గా మారనుందని ఆ పాత్ర కోసం త్రివిక్రమ్ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశాడంటూ టాక్ న‌డుస్తుంది. ఇంతకీ ఆ రోల్‌ పోషిస్తున్న క్రేజీ హీరోయిన్ ఎవరో కాదు మన్మధుడు బ్యూటీ అన్షు అట. మన్మధుడు లో నాగార్జున సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సినిమాలకు చాలా కాలం బ్రేక్ ఇచ్చిన ఈమె.. తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ రీ ఎంట్రీలో ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది అంటూ టాక్ హైలెట్ గా మారుతుంది. ఒకవేళ ఇదే నిజమైతే కు అన్షుకు పెద్ద బూస్ట్ అప్ అవుతుందన‌టంలో సందేహం లేదు.