రూ.1000 కోట్ల సినిమాలేవి చేయట్లేదు.. అయినా చాలా హ్యాపీగా ఉన్నా.. సమంత

స్టార్ హీరోయిన్ సమంత.. కేవలం టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో తన సత్తా చాటుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా క్షణాలలో వైరల్ గా మారుతుంది. కాగా.. తాజాగా సమంత ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్లో పాల్గొని సందడి చేసింది. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. మయోసైటిస్ వల్ల నేను లైఫ్ లో చాలా విషయాలు నేర్చుకున్న.. ఈ పోరాటం నాకు ఎన్నో గొప్ప విషయాలను నేర్పింది అంటూ వివరించింది. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలిసొచ్చిందని.. ఈ జర్నీ నన్ను పూర్తిగా మార్చేసింది అని వివ‌రించింది.

గతంలో విజయం అంటే గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం అనుకున్న‌.. ఒక ఏడాదిలో నేను నటించిన ఐదు సినిమాలు రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అదే సక్సెస్ అని నేను భావించా. వరుసగా సినిమాలు చేయాలి బ్లాక్ బాస్టర్లు కొట్టాలి.. టాప్ 10 నటినటుల‌ జాబితాలో ఎప్పుడు ఉండాలి.. అది మాత్రమే ఆలోచ‌న‌. కానీ.. ఇప్పుడు నా ఆలోచన విధానం మారింది. రెండేళ్లుగా నా సినిమాలు రిలీజ్ కాలేదు.. నేను టాప్ టెన్ లిస్ట్ లోనే లేకున్నా.. నేను రూ.1000 కోట్ల సినిమాలేవి చేయకున్నా.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్న అంటూ వివరించింది.

Samantha Ruth Prabhu Shares Teaser Of Health Podcast: "Lets Take 20...To  Talk About Health"

గతంలో ఎప్పుడూ భయపడుతూ ఉండేదాన్ని.. రేపు నా స్థానని ఎవరు కొట్టేస్తారో.. బాక్సాఫీస్ దగ్గర నెంబర్ల క్యాలిక్యులేషన్ వేసుకుంటూ శుక్రవారం వచ్చిందంటే చాలు.. టెన్షన్లో ఉండేదాన్ని. నా ఆత్మగౌరవం మొత్తం ఆ నెంబర్లు పైనే ఉందని భావించేదాన్ని.. ఇప్పుడు పూర్తిగా నా ఆలోచనలు మారాయి.. నేను మారా.. నా ఫాలోవర్స్ చాలామంది నన్ను గ్లామ‌ర్‌, ఎంటర్టైన్మెంట్ కోసమే ఫాలో అవుతున్నారని నాకు కూడా తెలుసు. కానీ.. వాళ్ల కోసం నేను ఏడాది నుంచి హెల్త్ ఫాడ్‌కాస్ట్‌ నిర్వహిస్తున్న. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమాచారం కావాలన్నా.. వాళ్ళు ఎక్కడో వెతికే అవసరం ఉండకూడదని.. ఇలాంటి డెసిష‌న్ తీసుకున్నా అంటూ సమంత చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.