ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో.. సినిమాల విషయంలో విచిత్రమైన రిజల్ట్ ను చూస్తూనే ఉన్నాం. భారీ బడ్జెట్లో బడా ప్రాజెక్టుగా రూపొందుతున్న స్టార్ హీరోల సినిమాలు ప్లాప్లుగా మారుతుంటే.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన చిన్న సినిమాలు కంటెంట్‌తో ఆకట్టుకుని బ్లాక్ బస్టర్‌గా నిలుస్తున్నాయి. తాజాగా.. ఈ లిస్టులోకి లిటిల్ హార్ట్స్ సినిమా సైతం చేరిపోయింది. ఇక ఇప్పటివరకు కేవలం ఓటీటీ వెబ్ సిరీస్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈటీవీ విన్.. ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మొట్టమొదటి థియేట్రికల్ మూవీ ఇది.
సాయి మార్తాండ్ డైరెక్షన్‌లో మౌలి తనూజ్, శివాని నాగారం ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా యూత్ తో పాటు.. ఎంతోమంది బడా స్టార్స్‌ను సైతం ఫిదా చేసింది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్‌లతో సంచలనాలు సృష్టిస్తుంటే.. మరోపర్ర ఎంతోమంది హీరోలు సోషల్ మీడియా వేదిక ప్రసంసలు కురిపిస్తున్నారు. అలా.. తాజాగా హీరో నాని, డైరెక్టర్ సాయి రాజేష్, టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ అబీషన్ జీవింత్ సినిమాను తెగ మెచ్చుకున్నారు. నాని.. లిటిల్ హార్ట్స్ సినిమా చూశాను.. ఎంత సరదాగా సాగిపోయిందో మాటల్లో చెప్పలేను. చాలా కాలం తర్వాత ఈ సినిమా చూసి మనస్ఫూర్తిగా నవ్వుకున్నాను. అఖిల్, మధు, కాత్యాయని వీళ్ళందరూ కలిసి నా రోజు నవ్వుల తో కంప్లీట్ చేశారు.
మీ అందరికీ చాలా థాంక్స్ తప్ప ఏం చెప్పగలను అంటూ వివరించాడు. ఇక డైరెక్టర్ సాయి రాజేష్ కంటెంట్ ఎప్పుడు కింగ్ అని మరోసారి లిటిల్ హార్ట్స్‌తో రుజువైంది. అద్భుతమైన సినిమా ఇది. ఎంత బాగుందంటే.. ఐదు నిమిషాలు కూడా నవ్వు ఆగలేదు అంటూ వివరించాడు. ప్రతి రెండేళ్లకు, మూడేళ్లకు ఎవరో ఒకరు ఇలా వచ్చి బాక్సాఫీస్‌ను బ్రేక్ చేస్తున్నారని.. తన పోస్టులో పేర్కొన్నాడు. ఇక టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్ మీ స్నేహితులు.. ఫ్యామిలీ లతో కలిసి చూసే అందమైన అద్భుతమైన మూవీ.. ఆధ్యాంతం నవ్వులు పోయుంచే మూవీ లిటిల్ హార్ట్స్ అంటూ వివరించాడు. ప్రస్తుతం వీళ్ళు చేసిన పోస్టులు నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి.