ఆ స్టార్ హీరో తో శ్రీ లీల డేటింగ్.. పెళ్ళికి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్..!

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శ్రీ‌లీల‌కు ఎలాంటి క్రెజ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు టాలీవుడ్ క్రేజీ హీరోలా అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల బాలీవుడ్ లోను ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఇక అమ్మడు నటించిన సినిమాలు ఫ్లాపులుగా నిలుస్తున్నా.. క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు సరి కదా.. అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ క్రమంలోనే స్టార్ హీరోస్ సైతం శ్రీ లీల జపం చేస్తూ.. వరుస ఆఫర్లను ఇస్తున్నారు. ఇక ఎలాంటి స్టార్ హీరోయిన్ అయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత వాళ్లపై రూమర్స్ రావడం సహజం. అలా ఇప్పుడు శ్రీ లీల చుట్టూ ఓ యాంగ్ హీరోతో డేటింగ్ వార్త‌లు తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Kartik Aaryan's Mom Hints at His Relationship with Sreeleela, Calls for a  'Doctor Bahu'

ఇప్పటివరకు టాలీవుడ్ లో సత్తా చాటిన ఈ అమ్మడు.. ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది. అనురాగ్ బ‌స్సు డైరెక్షన్లో బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ స‌ర‌సన ఆషికి 3లో ఈ అమ్మడు మెరవనుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. షూటింగ్ టైంలో కార్తీక్, శ్రీ లీల మధ్య ఏర్పడిన పరిచయం మరింత క్లోజ్‌నెస్‌కు దారితీసింది. దీంతో వీళ్ళిద్దరూ సెట్స్‌లోనే కాదు.. బయట కూడా ఎన్నోసార్లు చట్టపట్టలేసుకొని కనిపించారు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందంటూ టాక్ బాలీవుడ్.. టాలీవుడ్ లోనూ తెగ వైరల్ గా మారింది. వాటికి ప్రధాన కారణం ముంబై బాంద్రాలోని ఓ రెస్టారెంట్ లో వెళ్లిద్దరు కలిసి డిన్నర్ చేస్తున్న వీడియో బయటకు రావడం. అలాగే.. పబ్లిక్ లో ఎన్నోసార్లు కలిసి కనిపించడం.

అంతేకాదు.. గతంలో కార్తీక్ తల్లి మాలా తివారి తనకు ఓ డాక్టర్ కోడలు కావాలంటే చేసిన కామెంట్స్.. ఇక శ్రీ లీల తన మెడిస‌న్‌ కంప్లీట్ చేసి అప్ప‌టికే డాక్టర్ పట్టా పుచ్చుకుంది. అంతేకాదు.. ఓ మూవీ స‌మ్మేట్‌లోను కార్తీక్ తల్లి శ్రీ లీలతో చాలా క్లోజ్ గా కనిపించింది. దీంతో వీళ్ల ప్రేమ నిజమేనంటూ వార్తలు మరింత వైరల్ గా మారాయి. అయితే తాజాగా వీళ్లిద్దరు డేటింగ్కు మరింత బాలన్స్ చేకూరే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇంట్లో ఇటీవల వినాయక చవితి సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. ఈ వేడుకల్లో శ్రీ లీల తో పాటు ఆమె తల్లి కూడా సందడి చేయడం సెన్సేషన్ గా మారింది. ఇరు ఫ్యామిలీ కలిసి పండుగను గ్రాండ్గా జరుపుకున్నాయి. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్, శ్రీలీల‌ మధ్యన డేటింగ్ కన్ఫర్మ్ అయిపోయిందని.. వీరిద్దరి పెళ్ళికి ఇరు ఫ్యామిలీస్‌ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉంటారంటూ టాక్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఈ రెండు కుటుంబాలు కలిసి దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ డేటింగ్ వార్తలపై అటు కార్తీక్ అని ఇటు శ్రీలేలా కానీ అఫీషియల్ గా రియాక్ట్ కాలేదు.