టాలీవుడ్ దర్శక దీరుడు రాజమౌళి కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్ లో దర్శకుడుగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ స్టార్ హీరో రేంజ్ లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అలాంటి రాజమౌళి దర్శకుడిగా కాకుండా.. ఓ నటుడుగా స్క్రీన్ పై కనిపిస్తే ఇక ఆయన ఫ్యాన్స్ లో ఉండే సందడి వాతావరణం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఏ సినిమాలో అయినా చిన్న క్యామియో రోల్లో నటిస్తున్నారన్న చాలు.. సినిమా చూడడానికి జక్కన్న ఫ్యాన్స్ తెగ ఆరాటపడతారు అనడంలో సందేహం లేదు.
ఇక రాజమౌళికి బాలీవుడ్ లోను అదే రేంజ్లో క్రేజ్ ఉన్న నేపథ్యంలో.. తాజాగా ఓ స్టార్ హీరో కొడుకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సినీస్ కోసం రాజమౌళి రంగంలోకి దిగుతున్నాడట. అతని వెబ్ సిరీస్‌లో ఓ గెస్ట్ రోల్లో జక్కన మెరవనున్నాడని టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ వెబ్ సిరీస్ మరేదో కాదు.. ద బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్. ఈ సిరీస్‌కు బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఈ సినిమాల్లో యంగ్ యాక్టర్ లక్ష, సహారా ప్రధాన పాత్రలో మెరువనున్నారు. ఈనెల 18న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు టీం. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టా వేదికగా ట్రైలర్ నెట్‌ఫ్లిక్స్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రాజమౌళి గెస్ట్ రోల్లో మెరిసిన ఈ సినిమా.. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రయాణం ఆధారంగా రూపొందించారు. ఇందులో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, రణ్వీర్ సింగ్, బాబీ దేవోల్, దిశ పటాని తదితరులు గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. గౌరీ ఖాన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ సిరీస్‌పై ఇప్పటికే బాలీవుడ్ ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. జపాన్ ఎంట్రీ తో ఈ సిరీస్ పై టాలీవుడ్‌లోను మంచి హైప్ మొదలైంది.