టాలీవుడ్ హీరో తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మీరాయ్‌తో మరోసారి హిట్ కొట్టి స్టార్‌డం మరింతగా పెంచుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, సాంగ్స్.. ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తుంది. అయితే.. మొదట ఘాటి సినిమాకు పోటీగా మీరాయి వస్తుందని అంతా భావించారు. కానీ.. ఘాటి లైన్ క్లియర్ చేస్తూ.. కిష్కింధపురి సినిమాకు ఝలక్ ఇచ్చింది. టాలీవుడ్ సంగతేమో కానీ.. ఇతర ఇండస్ట్రీలో మీరాయ్ దాదాపు పది సినిమాల టార్గెట్‌ను దాటుకుని స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంది. అన్నిటికంటే ఎక్కువగా బిగ్ బడ్జెట్ ఫీల్ కల్పించే మూడు చిన్న సినిమాల కాంపిటీషన్ తట్టుకోవాల్సి ఉంది.డిఎన్ఏతో రీసెంట్గా మంచి సక్సెస్ అందుకున్న ఆధర్వా నుంచి వస్తున్న నెక్స్ట్ ఫిలిం తనల్. దీన్నే తెలుగులో టన్నల్ పేరుతో రిలీజ్ చేయనున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా.. యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 12న తమిళ్లో రిలీజ్ కానుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ బ్లాక్ మెయిల్ సినిమా సైతం అదే రోజున రిలీజ్ అవుతుంది. ఇక ఇప్పటికే.. రెండు సినిమాలు నుంచి వచ్చిన ట్రైలర్స్ ఆడియన్స్ లో మంచి ఇంటెన్స్ ను క్రియేట్ చేశాయి. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ హీరోగా నటిస్తున్న మరో అప్కమింగ్ మూవీ ఫిలిం బాంబ్. శివాత్మిక రాజశేఖర్ తో రూపొందిస్తున్న ఈ సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇది కూడా అప్పుడే రిలీజ్ కు సిద్ధమవుతుంది.
ఇక ఈ సినిమాలతో పాటే.. కుమార సంభవం, కాయల్‌యోలో, మదురై 16, వృత్తి లాంటి చిన్న చిన్న సినిమాలు కూడా వరుసగా రిలీజ్ అవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకొని మీరాయ్ స్ట్రాంగ గా నిలబడాల్సి ఉంది. చిన్న సినిమా అయినా.. పెద్ద సినిమా అయినా ఇక్కడ బడ్జెట్ కాదు కంటెంట్ ముఖ్యం. ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో తేజ సజ్జా స్ట్రాంగ్ కాంపిటీషన్‌ను ఎదుర్కొని స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంది. ఇక తమిళ్ ఆడియన్స్ తేజ సజ్జాకు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో చూడాలి.