యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ సినిమాతో ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడో తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో సంచలనం సృష్టించింది. దాదాపు రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తేజ సజ్జ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని అంతా భావించారు. అంతేకాదు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తేజా తన నెక్స్ట్ సినిమాలకు రెమ్యూనరేషన్ మరింతగా పెంచేసాడని టాక్ కూడా తెగ వైరల్ గా మారింది. ఇక హనుమాన్ సినిమాకు ముందు వరకు తేజ పెద్ద హీరో కాకపోవడంతో.. మొదట తక్కువ రిమ్యునరేషన్ ఇచ్చినా.. సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు ఆయనకు ఎక్కువగానే ముట్టించారంటూ టాక్ నడిచింది.
కానీ.. ఒక రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదట. ఈ విషయం డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా తేజా సజ్జ క్లారిటీ ఇచ్చాడు. అయితే హనుమాన్ తర్వాత మీరాయ్ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని వార్త కూడా ఫేక్ అని.. కేవలం హనుమాన్కు ఏ రేంజ్ లో అయితే రెమ్యూనరేషన్ ఛార్జ్ చేశాడో అదే రెమ్యూనరేషన్ ఈ సినిమాకు కూడా తీసుకున్నడట. దీనికి కారణమేంటో తేజ సజ్జ స్వయంగా వివరించాడు. ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూట్యూబర్ ప్రశ్నిస్తూ హనుమాన్ సక్సెస్ అయిన తర్వాత కూడా ప్రొడ్యూసర్ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా ఇవ్వలేదట కదా.. అనే ప్రశ్నకు తేజా సజ్జ రియాక్ట్ అయ్యాడు. ఇబ్బందిగా ఫీలైన తాను.. నేను దీనిపై డిస్కస్ చేయాలనుకోవడం లేదంటూ వివరించాడు.
అయితే.. ప్రొడ్యూసర్ మనీ ఇచ్చి ఉంటే అమౌంట్ చెప్పకపోయినా.. ఇచ్చారనే సమాధానం చెప్పి ఉండేవాడని.. ఇంతగా ఇబ్బంది పడుతున్నాడంటే.. ఒక రూపాయి కూడా ప్రొడ్యూసర్ ఇచ్చి ఉండడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన నుంచి వస్తున్న మీరాయ్ సినిమా కూడా హనుమాన్ టైంలో వచ్చిన ఛాన్సే కావడంతో.. ఈ సినిమాకు కూడా అదే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తేజ వివరించాడు. మీరాయ్ ప్రొడ్యూసర్ పై నాకు నమ్మకం ఉందని.. ఒకవేళ సినిమా హిట్ అయితే నాకు కచ్చితంగా మంచి అమౌంట్ ఇస్తారని కాన్ఫిడెంట్గా వెల్లడించాడు. తనని నమ్మీ సినిమా మీద డబ్బులు పెడుతున్నారని.. హనుమాన్ హిట్ అయింది ఇప్పుడు మరింత రెమ్యూనరేషన్ ఇవ్వమని అడగలేను అంటూ ఓపెన్ గా వివరించాడు. ఒక సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్ల నుంచి ముక్కు పిండి మరీ డబ్బు వసూళ్లు చేసే హీరోలు ఉన్న ఈ రోజుల్లో.. తేజ సజ్జ మెచ్యూరిటీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక త్వరలోనే ఆడియన్స్లో పలకరించినన్న ఈ సినిమాతో తేజ మరోసారి రికార్డులు క్రియేట్ చేస్తాడా లేదా.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.