టాలీవుడ్ లేడీ పవర్ స్టార్ అనుష్క శెట్టి.. లేటెస్ట్ మూవీ ఘాటి. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత అమ్మడు నటించిన సినిమా ఇది. క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలో విక్రమ్ ప్రభు మెయిన్ లీడ్‌గా.. జగపతిబాబు, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు. ఇక రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా.. నిన్న రిలీజైన ఈ మూవీ ఆడియన్స్‌లో మిక్స్డ్ టాక్ సంపాదించుకునకన్నా.. కలెక్షన్ విషయంలో మాత్రం బిగ్ డ్యామేజ్ ఎదుర్కొన్నట్టు టాక్ నడుస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమా ప్రమోషనల్ కంటెంట్ లో అమ్మడి యాక్షన్, వైలెన్స్ చూసి అనుష్క కెరీర్ లో కచ్చితంగా ఇది పవర్ఫుల్ రోల్ అయి ఉంటుందని అంత భావించారు.
ఈ సినిమాతో అమ్మడు బ్లాక్ బాస్టర్ కొడుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేశారు. కానీ.. ఈ మూవీ ఫస్ట్ డే నుంచే మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. దీంతో బుకింగ్స్ పై భారీ ప్రభావమే పడింది. తాజాగా.. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ నెటింట తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఘాటి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.5.53 కోట్ల వసూళ్లను కొల్లగొట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. స్వీటీ కెరీర్‌లోనే ఈ రేంజ్‌లో వీక్ కలెక్షన్స్ రాలేదని చెబుతున్నారు. ఇక మొదటి రోజు దాదాపు రూ.10 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొడుతుంది అని అంత స్ట్రాంగ్ గా నమ్మారు. కానీ.. అంచనాలన్నింటినీ తారుమారు చేసేసి ఘాటి అందరికీ షాక్ ఇచ్చింది.
సినిమా రూ.50 కోట్ల బడ్జెట్ తో.. రూ.52 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది. అంటే.. సినిమా బ్రేక్ ఈవెన్‌కు రూ.55 కోట్ల షేర్.. రూ.100 కోట్ల గ్రాస్ తప్పనిసరి. అనుష్కకు ఉన్న క్రేజ్‌తో.. ఘాటి సినిమా ఖచ్చితంగా బ్రేకింగ్ రీచ్ అవుతుందని అంత భావించారు. కానీ.. మొదటి రోజు కలెక్షన్స్ చూస్తుంటే అమ్మడి క్రేజ్ భారీగా తగ్గిపోయిందనే సందేహాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వినాయక చవితి నవరాత్రుల సెలబ్రేషన్స్, నిమర్జనం పనుల్లోనూ నిమగ్నం అయిపోయిన జనం.. థియేటర్లోకి వెళ్లి సినిమా చూసి ఉండక పోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈరోజు, రేపు వీకెండ్ డేస్ కావడంతో ఘాటి సినిమా కలెక్షన్లు ఏమైనా పుంజుకుంటాయేమో.. ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయో వేచి చూడాలి.