టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళికి కేవలం పాన్ ఇండియా లెవెల్లో కాదు.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఇమేజ్ ఏర్పడింది. తన ప్రతి సినిమాతో తాను మాత్రమే సక్సెస్ అందుకోవడం కాదు.. తెలుగు సినిమా కీర్తి అంతకంతకు పెంచుకుంటూ పోతున్నాడు జక్కన. ఇండియాలో ఉన్న టాప్ సూపర్ స్టార్స్ కంటే.. జక్కన్న పెద్ద స్థాయిలో నిలిచాడు. బాహుబలి సిరీస్‌తో టాలీవుడ్‌ను పాన్ ఇండియా రేంజ్‌కు తీసుకెళ్లిన ఈయన.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టాడు. ఇప్పుడు మహేష్ బాబు హీరోగా SSMB 29 సినిమాతో ఏకంగా హాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను బ్లాస్ట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కొంతకాలం క్రితమే షూటింగ్ కార్యక్రమాలను ప్రారంభించిన టీం.. ప్రస్తుతం కెన్యాలోని నైరోబి అడవుల్లో సరికొత్త స్కేడ్యులను రూపొందిస్తున్నారు.
ఇలాంటి క్రమంలో కొద్దిగా గంటల క్రితం సినిమా సెట్స్‌లో మహేష్‌కు సంబంధించిన కొన్ని క్రేజీ ఫొటోస్ లీక్ అయ్యాయి. అందులో మహేష్ లుక్స్ చూసే ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేస్తోంది. సినిమా ఫుల్ రన్ కలెక్షన్ టార్గెట్.. ఏకంగా రూ.10 వేల కోట్లు అట. తన టార్గెట్ ఎలా అయినా రీచ్ అయ్యా దిశగా ఇప్పటినుంచే రాజమౌళి కష్టపడుతున్నాడని.. పగడ్బందీగా ప్లాన్ మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. డిస్నీ మరియు సోనీ పిక్చర్స్ లాంటి టాప్ హాలీవుడ్ సంస్థలతో ఇప్పటికే తన మంతనాలు పూర్తిచేసిన జక్కన్న.. ఏకంగా 120 దేశాల్లో సినిమాను రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నాడు. దాదాపు వన్ బిలియన్ ఆడియన్స్‌ను టార్గెట్గా చేసుకుని సినిమాను రూపొందిస్తున్నాడు.
ఇది మన టాలీవుడ్‌ను పీక్ రేంజ్‌కు చేర్చడంలో చివరి అంతస్తు అనడంలో అతిశయోక్తి లేదు. రాజమౌళిని చూసి ఇప్పుడు అల్లు అర్జున్ – అట్లీ, అలాగే ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబో సైతం పాన్ వరల్డ్ రేంజ్ లో తమ మూవీ తెరకెక్కించాలని ప్లాన్లు మొదలుపెట్టాయి. 2027 మార్చి 27 ఈ సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు జెన్ 43 అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు టాక్. కాగా.. శ్రీరాముడి వంశానికి చెందిన 43వ తరం వ్యక్తిగా మహేష్ కనిపించనున్నాడట. ఫారెస్ట్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్‌తో ఇతిహాసాలను టచ్ చేస్తూ ఈ సినిమా రూపొందుతుండగా,, అందరి అంచనాలను మించి పోయే రేంజ్‌లో స్టోరీని డిజైన్ చేస్తున్నాడట జక్కన్న. ఇక ఈ సినిమాలో విలన్స్ గా ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ మెరవనున్నారు. ఇక సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ నవంబర్ నెలలో రిలీజ్ చేస్తానని జక్కన్న మహేష్ బర్త్డే సెలబ్రేషన్స్ భాగంగా అఫీషియల్ గా వెల్లడించాడు.