అ హీరోతో కలిసి ఎంజాయ్ చేస్తున్న మీనాక్షి.. అడ్డంగా దొరికిపోయిందే

క్రేజీ బ్యూటీ మీనాక్షీ చౌద‌రీ.. ప్ర‌జెంట్ తెలుగు స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఇక త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిన ఒకే ఒక్క‌ సినిమాతో మోస్ట్ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ మూవీ మరేదో కాదు.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మెరిసిన గుంటూరు కారం. ఈ సినిమాలో.. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. అంతకుముందు కొన్ని సినిమాల్లో అమ్మడు హీరోయిన్గా మెరిసినా ఊహించిన సక్సెస్ మాత్రం అందుకోలేదు. ఇక గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్గా మెరిసి మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే సంక్రాంతి వస్తున్నాం సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

ఇక ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ సినిమా సైతం.. బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. అంతేకాదు.. దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లక్కీ భాస్కర్ సినిమాతోను అమ్మ‌డి క్రేజ్‌ మరింతగా పెరిగింది. ప్రస్తుతం మీనాక్షి తెలుగులో వరుస సినిమాల్లో నటిస్తోంది. అలా టాలీవుడ్ టాప్ స్టార్ హీరో సినిమాలో మరో జాక్పాట్ ఆఫర్ కొట్టేసింది. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి. చిరు హీరోగా.. మల్లిడి వసిష్ఠ‌ డైరెక్షన్‌లో వస్తున్న విశ్వంభర సినిమాలో అమ్మడు ఓ కీల‌క‌ పాత్రలో మెర‌వ‌నుందట. దేవకన్యలా మీనాక్షి కనిపించనుందని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూట్ శ‌ర‌వేగంగా జరుగుతుంది.

Meenakshi Chaudhary-Sushant spotted at the airport ఎయిర్ పోర్ట్ లో దొరికిన మీనాక్షి-సుశాంత్

ఇలాంటి క్రమంలో.. అమ్మడు ఓ టాలీవుడ్ హీరోతో రిలేషన్‌లో ఉందంటూ టాక్‌ వైరల్ గా మారుతుంది. దానికి కారణం ఇటీవల హీరోతో కలిసి ఎయిర్పోర్ట్‌లో తెగ నవ్వుకుంటూ.. ఎంజాయ్ చేస్తూ తిరగడమే. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అక్కినేని సుశాంత్‌. వీళ్ళిద్దరూ కలిసి గతంలో ఇచ్చట వాహనాలు నిలపరాదు సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని.. ఇప్పటికి వాళ్ల రిలేషన్ కొనసాగుతుందంటూ టాక్ నడుస్తుంది. తాజాగా.. వీళ్ళిద్దరూ కలిసి ఒకే చోట దర్శనం ఇవ్వడం.. ఆ వీడియో నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఈ క్రమంలోనే వీళ్ళ రిలేషన్ వార్తలు నిజమేనంటూ అంతా భావిస్తున్నారు. మరి ఈ వార్తలపై మీనాక్షి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.