కెరీర్ లెక్కలోను మా మాస్టర్ తగ్గేదేలే.. సుక్కు పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సన్నాకు ఆడియన్స్‌లో ప్రత్యేక ప‌రిచ‌యాలు అవసరం లేదు. బుచ్చిబాబు సన్న కేవలం సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించడమే కాదు.. సుకుమార్ లెక్కల మాస్టర్ గా కాలేజిలో పనిచేస్తున్న టైంలోను ఆయనకు స్టూడెంట్. ఈ క్రమంలోనే టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ సుకుమార్‌కు బుచ్చిబాబు సన్న స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. బుచ్చిబాబు సన్నా.. త‌న‌ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. మాస్టర్ లెక్కలు చెప్తే మనకి బాగా ఎక్కింది.. అభిమానం అనే లెక్క మరింతగా పెరిగింది.. ఆ లెక్క చదువుకే పరిమితం కాకుండా కెరీర్ లెక్కలు చూసేవరకు ఎదిగింది అంటూ రాసుకోచ్చాడు. ఓ లెక్కల మాస్టర్ ఒకర్రాడు జీవితాన్ని ఇంతగా ప్రభావితం చేశారంటూ.. బుచ్చిబాబు వివరించాడు. టీచర్స్ డే సందర్భంగా ఉప్పెన ఫేమ్‌ డైరెక్టర్ అయిన బుచ్చిబాబు తన గురువు సుకుమార్ గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

Free Photo: Buchi Babu Sana- Sukumar

త‌ను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో తన గురువుతో తనకున్న జ్ఞాపకాలను పంచుకుంటూ నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు.. సుక్కు సార్‌ చాలా బాగుండేవాడు. బ‌క్క‌గా, తెల్లగా, షార్ప్‌ మీసాలతో, హ్యాండ్స్ వరకు బటన్స్ పెట్టి.. చాలా నీట్ గా వచ్చేవారు. ఇక.. ఆయన చిరంజీవి ఫ్యాన్ అని తెలిసిన తర్వాత మా సీనియర్స్ అంతా ఓ 40,50 మంది సార్ వస్తుంటే చాలు.. మాస్టర్ సినిమాలో హేజు హేజు అనే బ్యాగ్రౌండ్ స్కోర్ ను ఇస్తూ ఉండేవాళ్ళు. ఆయన తెగ మురిసిపోయేవారు. సుకుమార్ గారు చిరంజీవి ఫ్యాన్ అయితే.. మేము సుకుమార్ సార్ ఫ్యాన్స్ అంటూ వివరించాడు బుచ్చిబాబు. ఇక ఇంటర్‌లో ఎంతమంది మాస్ట‌ర్స్‌ ఉంటారు. కానీ.. లెక్కలు మాస్టర్ కి మీరు కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటి అనే ప్రశ్నకు.. స్టూడెంట్స్ మ్యాథ్స్‌కి కనెక్ట్ అవ్వడం చాలా రేర్. అలాంటిది మ్యాథ్స్‌ మాస్టర్‌కి ఎందుకు కనెక్ట్ అవుతాం. అయినా.. ఆయనకి కనెక్ట్ అయ్యాం. ఎందుకంటే లెక్కలు కూడా సార్ అంత అందంగా చెప్పేవాడు.

తెలుగు పాఠంలో విడదీసి అర్థమయ్యేలా వినిపించేవారు. ఫార్ములాస్ కూడా చాలా ఈజీగా చెప్పడం మా సార్ ప్రత్యేకత. అప్పుడు లెక్కలు చెప్పడంలో.. ఇప్పుడు కెరీర్ లెక్కల్లో అసలు తగ్గేదేలే అంటూ వివరించాడు. ఇక ఆయన కాకుండా మరో ఫేవరెట్ గురువు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్నకు గరికిపాటి నరసింహారావు గారు నా గురువు గారే. కాకినాడ చైతన్య కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ చదువుకునే టైంలో ఆయన నాకు సాన్‌స్క్రిట్ చెప్పేవారు. ఆయన పాటాలు చెప్పే విధానం చాలా చమత్కారంగా అనిపించేది. ఒకసారి రాజు అని నా స్నేహితుడు క్లాస్ కి లేటుగా వచ్చి మే ఐ కమింగ్ సార్ అన్నాడు. గరికపాటి గారు తమరి నామధేయమేమిటో అని అడగగా.. వాడు రాజు అనగానే ఏ రాజ్యానికో అని సెటైర్ వేశారు. వాడు క్లాస్ వింటూ నెత్తి మీద టోపీ తీయలేదు. రాజావారు తమ కిరిటాని తీయాలి అంటూ మాట్లాడారు. ఆయన అంతా ఫన్నీగా మాతో ఉండేవారు. పాటలను కూడా ప్రవచనాలలా వినిపించేవారు. ఆయన చెప్పిన సాంస్కృతంలోనే నాకు ఎక్కువ మార్కులు. ఇలాంటి గురువులు దొరకడం నా అదృష్టం. సినిమాలో ఒకరు, సాహిత్యంలో ఒకరు.. నన్ను అమితంగా ప్రభావితం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు.

A heartfelt moment ❤️ Buchi Babu with His Guru Sukumar Celebrating the  roaring success of #Pushpa2TheRule #AlluArjun #Sukumar #Pushpa2 #Gulte  #BuchibabuSana #Rashmika #Sreeleela

ఇక సుకుమార్ గారికి మీకు మధ్యన ఏదైనా చిన్న మనస్పర్ధలు వస్తే మొదట ఎవరు మాట్లాడతారు అనే ప్రశ్నకు.. మనం తప్పు చేసాం, ఆయన తిట్టారు.. ఫోన్ చేసి మాట్లాడదామని నేను అనుకుంటా.. ఫోన్ తీసేలోపే ఆయన మెసేజ్ ఉంటుంది. సారీరా ఏమనుకోకు.. ఏదో మాట అనేసా అంటారు. మా గురువుగారు ఎదుటోడు ఎంత పెద్ద తప్పు చేసినా.. క్షమించడంలో మొదటి వరుసలో ఉంటారంటూ చెప్పుకొచ్చాడు. ఇక మీ లైఫ్ లో మీ సార్ పాత్ర ఏంటి అని అడిగితే బుచ్చిబాబుగా సంబంధం లేదు.. కానీ డైరెక్టర్ బుచ్చిబాబు సన్నాకు మాత్రం మొత్తం.. మా గురువుగారి పాత్రే ఉంది అంటూ వివరించాడు. ఇక సుకుమార్ గారు మిమ్మల్ని ఎలా పిలుస్తారు అని ప్రశ్నకు ఒరేయ్ అంటారు.. అంత క్లోజ్ అయితే తప్ప ఎవరిని ఒరేయ్‌ అనరు. నాకు ఒరేయ్‌ అని పిలిపించుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందంటూ వివరించాడు. గురువును మించిన శిష్యుడు కావాలని కోరిక ఉందా అనే ప్రశ్నకు.. గురువును మించి కాదు గాని.. గురువు మెచ్చిన శిష్యుడు కావాలని కోరిక మాత్రం ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ సమాధానాలు నెటింట వైరల్‌గా మారుతున్నాయి.