హారర్ థ్రిల్లర్‌తో మహేష్ మరదలు టాలీవుడ్ ఎంట్రీ.. శిల్పా శిరోద్కర్‌కు అవార్డుల వర్షం పక్కా అట..

టాలీవుడ్ క్రేజీ హీరో సుధీర్ బాబు.. బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ జటాధర. హారర్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే మంచి హైప్ మొదలైంది. సినిమాలో సుధీర్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. జటాధర సినిమాకు ప్రేరణ ఆరోర సమర్పకురాలిగా వ్యవహరించగా.. సుధీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం వహించగా.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పవర్ పోస్ట‌ర్‌, గ్లింప్స్.. ఆడియన్స్‌లో మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

Jatadhara Unveils Striking Second Poster: Sudheer Babu's Supernatural Epic

సినిమాలో మరింత హైలెట్గా ట్రెండ్ అవుతున్నా మరో పాయింట్ శిల్పా శిరోద్కర్. పేరు పెద్దగా పరిచయం లేకుండా.. మహేష్ బాబు మరదలు అనగానే గుర్తొచ్చేస్తుంది. ఈ క్రమంలోనే సినిమాలో శిల్పా శిరోద్కర్ రోల్‌కు సంబంధించిన అప్డేట్స్ అందించారు. ఖుదా గవా, మృత్యుదంద్ లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న శిల్పా శిరోద్కర్.. బాలీవుడ్ లో మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే జటా ధరలో అమ్మ‌డి పర్ఫామెన్స్ తో అవార్డుల వర్షం కాయమంటూ.. సినిమా ప్రొడ్యూసర్ ప్రేరణ ఆరోరా వెల్లడించారు.

Shilpa Shirodkar reacts to Mahesh Babu being called 'Arrogant' | - Times of  India

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. జటాధ‌ర సినిమాలో శోభ అనే రోల్‌లో శిల్పా సిరోత్కొర్‌కు లెక్కలేన‌ని అవార్డులు వస్తాయని.. నమ్మకంగా చెబుతున్నా.. శోభా లా శక్తివంతమైన, సంక్లిష్టమైన రోల్ ను ఎంతో ఇంటెన్షన్ తీసుకువచ్చి చూపించిందని.. పాత్రకు తగ్గ న్యాయం చేసిందని ఆమె ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందంటూ.. వివరించింది. ఇక సినిమా సస్పెన్స్‌, యాక్షన్, మిస్టరీల ప్రత్యేకమైన స్టోరీ తో గ్రాండ్ లెవెల్ లో సిద్ధమైందని.. ప్రతి ఒక్క ఆడియన్స్‌ను ఇది ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. ఇక‌ ఇంద్ర కృష్ణ, రవి ప్రకాష్, దివ్య కోసులె, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పట్టాక్ కీలక పాత్రల్లో మెర‌వ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే మహేష్ ఫ్యాన్స్ మా అన్న మరదలు అంటూ పోస్టర్ తెగ ట్రెండ్ చేసేస్తున్నారు.