మీరాయ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే.. బిగ్ రిస్క్ చేస్తున్నారు..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జ హనుమాన్ లాంటి పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ మీరాయ్‌. సినిమాటోగ్రాఫర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న కార్తీక్ ఘట్టమనేని మొదటిసారి ఈ సినిమాతో దర్శకుడుగా మారాడు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా ధియేట్రిక‌ల్ ట్రైలర్ ఆడియన్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్‌ను దక్కించుకుని దూసుకుపోతుంది. సినిమా క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గలేదని ట్రైలర్ కట్స్ తోనే క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాతో సరికొత్త ప్రపంచంలోకి ఆడియన్స్‌ను తీసుకువెళ్లడమే లక్ష్యంగా మేకర్స్ కంటెంట్ డిజైన్ చేశారట‌. ఇక ట్రైలర్ చూస్తుంటే బడ్జెట్ భారీగానే పెట్టినట్లు అనిపిస్తుంది. కానీ.. మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ మాత్రం.. చాలా తక్కువ బడ్జెట్ వాడినట్లు చెప్పకనే చెప్పారు.

Teja Sajja-starrer 'Mirai' gets new release date; trailer to be out on August 28

ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధ‌రలు పెంచడం లేదంటూ ఆయన క్లారిటీ ఇచ్చాడు. సెప్టెంబర్ 12న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ రిలీజ్ థియేట్రిక‌ల్ బిజినెస్ ను సైతం పూర్తి చేసింది. అయితే.. ఇప్పుడు సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. సినిమాతో బిగ్ రిస్క్ చేస్తున్నారంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరాయ్‌.. తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఏకంగా రూ.170 కోట్ల గ్రాస్ వ‌సూళ్లను కొల్లగొట్టాల్సి ఉందట. కాగా.. సినిమాకు రూ.100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనుకుంటే మాత్రం పొరపాటే. కేవలం రూ.25 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్‌తో గ్రేట్ టార్గెట్ తో మీరాయ్‌ రంగంలోకి దిగుతుంది.

Teja Sajja: తేజ సజ్జా మిరాయ్ పుట్టినరోజు స్పెషల్ పోస్టర్ విడుదల - NTV Telugu

ఇంత తక్కువ మొత్తానికి బిజినెస్ జరుపుకున్న సినిమాకు.. ఆ రేంజ్‌లో గ్రాస్ వసూళ్లు అంటే కాస్త కష్టమే. ఇక దానికి తగ్గట్టుగానే ఇటీవల రిలీజ్ అయిన భారీ సినిమాలు సైతం ప్లాపులుగా నిలుస్తూ వస్తున్నాయి. బయర్స్ దగ్గర డబ్బులు లేని కారణంగానే.. ఈ సినిమాకు ఇంత తక్కువ బిజినెస్ జరిగిందని టాక్‌ నడుస్తుంది. ఇక సినిమా ఫస్ట్ డే రిలీజ్ టాక్ తెచ్చుకున్నా చాలు.. కచ్చితంగా బ్రేక్ ఈవెన్ మార్క్‌ అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం సినిమా మొదటి రోజే తెలుగు రాష్ట్రాల నుంచి రూ.10 కోట్ల పైగా షేర్ వ‌సూళ‌ను దక్కించుకుంటుంది. మరి డైరెక్టర్ ఈ సినిమాను ఏ రేంజ్ లో డిజైన్ చేశాడో.. ఆడియన్స్‌ను ఎంత ఆకట్టుకుంటాడో.. తేజ సజ్జ కు ఎలాంటి ఇమేజ్ను తెచ్చి పెడతాడు చూడాలి.