టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరిగా నటించిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ దగ్గర సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. సుమారు ఆరేళ్లనుంచి సెట్స్నై ఉన్న ఈ సినిమా.. ఈ ఏడాదిలో నాలుగు సార్లు వాయిదా పడి ఎట్టకేలకు రిలీజ్ అయింది. ఇక సినిమా ఆడియన్స్లో మంచి హైప్ నెలకొల్పి.. ఓపెనింగ్స్ తో భారీగానే కలెక్షన్లు రాబట్టిన తర్వాత మిక్స్డ్ టాక్తో ఫుల్ రన్లో సినిమా పై ప్రభావం కనిపించింది. ఈ క్రమంలోనే.. కేవలం రూ.75 కోట్ల షేర్ వసూలతో సినిమాను క్లోజ్ చేయాల్సి వచ్చింది.
నిర్మాత ఏ.ఏం. రత్నంకు వచ్చిన భారీ నష్టాలతో భవిష్యత్తులో సినిమాలు చేయడం కష్టమే అనేలా పరిస్థితి మారింది అంటూ వార్తలు వినిపించాయి. కానీ.. ఇటీవల రత్నంకు ఎలాంటి నష్టం రాలేదని.. ఆయన తనయుడు జ్యోతి కృష్ణ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లరించాడు. సినిమా రిలీజ్ కి ముందే థియేట్రికల్ ప్లస్ నాన్ థియెట్రికల్ బిజినెస్లతో బ్రేక్ ఈవెన్ అయిపోయిందని.. మాకు ఏం నష్టం జరగలేదంటూ క్లారిటీ ఇచ్చాడు.
వీరమల్లు సీక్వెల్ చేస్తామో.. లేదో.. ఇప్పుడే చెప్పలేము కానీ.. ఏఎం. రత్నం, పవన్ కాంబోలో మరో సినిమా కచ్చితంగా ఉంటుందని ఇన్ డైరెక్ట్ కామెంట్లు చేశాడు. ఈసారి పవన్ హీరోగా ఓ మంచి టాప్ డైరెక్టర్ తో కమర్షియల్ సినిమా చేయాలని.. ఏఏం రత్నం ప్లాన్ లో ఉన్నాడట. అయితే.. ఇంతకీ ఆ టాప్ డైరెక్టర్ ఎవరు.. ఈ ప్రాజెక్టు పైకి వచ్చేది ఎప్పుడు అనేదానిపై క్లారిటీ లేకున్నా.. కచ్చితంగా సినిమా మాత్రం భారీ బడ్జెట్తో అదిరిపోయే రేంజ్లో మాత్రం తెరకెక్కనుందట.