స్టార్ బ్యూటీ అనుష్క.. మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఘాటి సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ఈ సినిమాను.. ఇప్పటికే రిలీజ్ చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు.. సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో సందడి చేస్తున్నారు టీం. ఇక.. సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ సినిమాపై హైప్‌ను అంతకంతకు పెంచేస్తున్నాయి. అనుష్కను చాలా వైవిద్యంగా పవర్ఫుల్‌గా చూపించనున్నట్లు తెలుస్తుంది. కేవలం స్వీటీ అభిమానులే కాదు.. సాధారణ సినీ ఆడియన్స్ సైతం.. సినిమాపై ఆసక్తి చూపుతున్నారు.
కాగా.. అనుష్క శెట్టి.. ఘాటి సినిమా కోసం.. పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమాను సైతం క్రిష్ పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. అంటే.. ఘాటి సినిమాపై కృష్‌కు ఉన్న నమ్మకం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలు ఆడియో పలకరిస్తూనే ఉంటాయి. అలానే ఘాటి సైతం చాలా విభిన్నంగా.. అనుష్క పవర్ఫుల్ లీడ్ రోలో మరువనుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్.. ఘాటీ సినిమాకు యూఎస్ సర్టిఫికెట్‌ను అందించారు. సినిమా పట్ల సెన్సార్ టీం పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం విశేషం. డైరెక్టర్ క్రిష్.. హీరోయిన్ అనుష్కను అభిమానించేలా సినిమా గర్వించదగ్గ రేంజ్‌లో ఉందని.. వారు అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఇక సినిమా ప్రారంభించే టైంలో.. చాలా సీక్రెట్‌గా మెయింటైన్ చేసినా.. రిలీజ్‌కు మాత్రం.. ప్రమోషన్లతో సందడి చేస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో థియేటర్లలో సందడి లేదు. ఒక్క బ్లాక్ బస్టర్ సక్సెస్ పడి చాలా కాలమే అవుతుంది. అందుకే.. ఘాటీ సినిమా కోసం బాక్స్ ఆఫీస్ వర్గాలు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. మినిమం హిట్ వచ్చిన చాలు.. బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తోంది అనడంలో సందేహం లేదు. ఇక అనుష్క సైతం సినిమాలకు చాలా కాలంగా దూరంగా ఉంటూ వస్తుంది. అయినప్పటికీ.. అమ్మడి క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. ఈ క్రమంలోనే ఘాటీ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి.. ఫ్యాన్స్‌కు స్వీటీ ఫుల్ ట్రీట్ ఇస్తుందో.. లేదో.. వేచి చూడాలి.